కుటుంబం ఒక్కటే, పార్టీలు వేరు. ఇలా అంటే ఒకప్పుడు నమ్మేవారు. కానీ ఇప్పుడు నమ్మడం మానేశారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలే పార్టీలయిపోయాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిందంటున్నారు కానీ, అది రాజకీయాల్లో బతికి వుంది. ప్రాంతీయ పార్టీలొచ్చాక, వాటి సారథ్యాన్ని కుటుంబాలే చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ కుటుంబం, తెలంగాణలో టీఆర్ఎస్ను కేసీఆర్ కుటుంబం, మహరాష్ట్రలో…