
తెలంగాణ!
తేల్చేస్తే తేలిపోతుంది
నాన్చేస్తే నానిపోతుంది.
తేలిపోతే, కాంగ్రెస్ తేలుతుందా? మునుగుతుందా? ఇప్పుడున్న స్థితిలో తేల్చకపోయినా మునుగుతుంది.
మునిగిపోవటం తప్పదన్నప్పుడు కూడా, కాంగ్రెస్ తేలే అవకాశం కోసం ప్రయత్నిస్తోంది. ఇది కొత్త పరిణామం. తేల్చటం వల్ల కాకుండా, నాన్చటం వల్లే ఈ ప్రయత్నం ఫలించగలదని ఆ పార్టీ నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది.