
అవునూ, కాదూ- మధ్యకూడా అనేక సమాధానాలుంటాయి.
అనుమానం వుంటే, ఒక్క సారి ‘అఖిల పక్షం’ పెట్టి చూడవచ్చు.
రాజకీయం మొత్తం- ఈ రెండూ కాకుండా, రెంటికి మధ్యే ఇరుక్కుని వుంటుందని తేలిపోయింది.
తెలంగాణా కావాలా? అంటే, అవునూ అని చెప్పిందెవరూ?
ప్రశ్న అడిగిన పెద్దమనిషినే- ‘మా సంగతి సరే, మరి నువ్వేమంటావ్?’ అని పీక పట్టుకున్నారు.
‘అ…అ…అవుదు’ అని కాస్సేపూ, ‘కా… కా…కావును’ అని కాస్సేపూ అని అన్నారు.