కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేడు వైరిపక్షాలు. ఎప్పుడూ కలసి లేవు. రెంటి వయసూ ఒకటి కూడా కాదు. స్వరాజ్యానికి ముందు నుంచే కాదు, అసలు స్వరాజ్యమే తాను తెచ్చానని భావించే పార్టీ కాంగ్రెస్. కానీ బీజేపీ అన్నది ఎమర్జన్సీ తర్వాత ఏర్పడ్డ జనతాపార్టీ ప్రభుత్వ ప్రయోగం విఫలమయిన తర్వాత మొక్కతొడిగిన పార్టీ బీజేపీ.…
Tag: pranab mukerji
కుర్చీలందు గోడకుర్చీలు వేరయా!
కుర్చీ కే కాదు, కుర్చీ పక్కన కుర్చీకి కూడా విలువ వుంటుందని రాజనీతిజ్ఞులు ఘోషిస్తున్నారు.
క్లాస్ రూమ్లో ఒకే ఒక కుర్చీ వుంటుంది. దాంట్లో టీచర్ కూర్చుంటారు. దాని పక్కన వేరే కుర్చీ వుండదు. కాబట్టి, విద్యార్థులకు కుర్చీ గురించే తెలుస్తుంది కానీ, పక్క కుర్చీ గురించి తెలీదు. కాక పోతే, హోమ్ వర్క్ చేయని విద్యార్థుల చేత మాత్రం పూర్వం ‘గోడ కుర్చీ’ వేయించే వారు. అంటే లేని కుర్చీని వున్నట్టుగా భావించి కూర్చోవటం. అది కూడా టీచర్ పక్కనే అలా కూర్చోవాలి.
కాబట్టే కుర్చీల గురించి చిన్నప్పుడు కలిగిన జ్ఞానమొక్కటే: ఉన్న కుర్చీలో కూర్చోవటం గౌరవం; లేని కుర్చీలో కూర్చోవటం శిక్ష.