దేశం లో అత్యున్నత పదవి ఏది?
పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగితే పిల్లలు ఈ సారి తెల్ల ముఖం వెయ్యాల్సిందే.
గతంలో లాగా, హోదాకు రాష్ట్రపతి, అధికారానికి ప్రధానమంత్రి- అని రాస్తే తప్పయ్యే ప్రమాదం వుంది. ఎలా తప్పూ- అంటే చెప్పలేం. చాలాకాలం పదవుల ఔన్నత్యాన్ని రాజ్యాంగమే నిర్ణయించింది. ఇప్పుడు రాజకీయమే నిర్ణయిస్తుంది.
రాష్ట్రపతి, ప్రధాని పదవులను మించిన పదవొకటి తొమ్మిదేళ్ల క్రితం తన్నుకొచ్చింది. ఆ పోస్టు పేరే ‘యూపీయే ఛైర్ పర్సన్’.