అదేమిటోకానీ, అద్వానీకి అందలం అందినట్టే అంది జారిపోతుంటుంది. ఒకప్పుడు వాజ్ పేయీ తన్నుకుపోతే, ఇప్పుడు మోడీ ఎత్తుకు పోయేటట్టు వున్నారు. ప్రధాని పదవే అలాంటిది. కొందరు ఎంత ఆశించినా దొరకదు. కొందరు ఆశించకపోయినా వచ్చేస్తుంది. బహుశా ఏకారణం చేతనేనేమో- మన్మోహన్ సింగ్‌ను చూస్తే, అద్వానీకి ‘అకారణం’గా కోపం వచ్చేది. ఇది గమనించిన మన్మోహన్ ఒకటి రెండు సందర్భాలలో ‘ఆయన బాధను నేను అర్థం చేసుకోగలను’ అని పైకి అనేశారు కూడా.
Tag: Prime Ministerial Candidate
మోడీ బాడీ ‘సిక్స్ ప్యాక్’ కాదా..?
మతిమరపు ఒకటే. నమూనాలు వేరు.
చాలా కాలం క్రితం పత్రికలో ఓ కార్టూన్ అచ్చయింది- మతిమరపు మీదే. గురు శిష్యులు క్లాస్‌కు వస్తుంటారు. గురువుగారికి చొక్కా వుండదు. ఆయన వెనకాలే నడుస్తున్న శిష్యుడికి ఫ్యాంటు వుండదు. అలాగని గురువుని మించిన శిష్యుడు-అని నిర్ధారణకు వచ్చేయనవసరం లేదు. ఇద్దరు మరచిపోయింది దుస్తులే కావచ్చు. శరీరాన్ని ఒకరు పైభాగం కప్పటం మరచిపోతే, ఇంకొకరు కింద భాగాన్ని మరచిపోయారు.
వృద్ధిలోకూడా ఎవరి నమూనా వారికి వుంటుంది.
‘గుజ’ బలుడు మోడీ
ఓడలు బళ్ళవుతాయి: అద్వానీలు మోడీలవుతారు.
బళ్ళు ఓడలవుతాయి: మోడీలు అద్వానీలవుతారు.
అలనాడు అద్వానీకి అనుంగు శిష్యుడు మోడీ. కానీ ఇప్పుడు, అదే అద్వానీ ‘న.మో’ అంటున్నారు.
రేపో, మాపో, అద్వానీ తాను వెనక్కి తగ్గి పోయి- ప్రధానివి నువ్వే- అని మోడీతోఅన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే పోటీలో వున్న వాళ్ళంతా ఇలాంటి ఆశీస్సులే ఇచ్చేస్తున్నారు.
‘హిందీ’త్వ మోడీ
పేరు : నరేంద్ర మోడీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: భారతీయ(జనతా) ప్రధాని
ముద్దు పేర్లు : మూడీ(వోటర్ల మూడ్స్ మారుస్తానని) త్రీడీ( మూడు సార్లు గెలవటమే కాదు, త్రీడీలోప్రచారం చేశానని), కేఢీ(అపార్థం చేసుకోకండి. ‘కే’ అంటే కేశూభాయ్ పటేల్, గుజరాత్లో రాజకీయ భీష్ముడు. ఆయన్నే ఎదుర్కొన్నాను.)
విద్యార్హతలు : బి.పి.ఎల్( అంటే ఐపిల్ అనుకునేరు. కానీ కాదు. బ్యాచిలర్ ఆఫ్ పోల్ మేనేజ్మెంట్. వోట్లు ఎలా వేయించుకోవాలో తెలిపే శాస్త్రం.) రాజనీతి శాస్త్రంలో నేను చేసిన మాస్టర్స్ డిగ్రీ కంటె ఇది పెద్దది.