అంతా కొత్త కొత్తగా వుంది.
వీధుల్లో కొత్త ముఖాలు.కొత్త అరుపులు. కొత్త ప్లకార్డులు. కొత్త నినాదాలు.
అల్లర్లు చేయటంలో అరవీసం శిక్షణలేని ముఖాలు. లాఠీలను ఎదురిస్తున్నాయి.
ఎండలో కొస్తే కమిలి పోయే లేత ముఖాలు. దుమ్ములేపుతున్నాయి. దుమ్ము పులుముకుంటున్నాయి.
ఖరీదయిన కాన్వెంట్లలో చదివి, ఐఐటి,ఐఐఎం, మెడికల్ కాలేజీల్లోని డార్మిటరీల్లో యవ్వనాన్ని గడిపి, కార్పోరేట్ సంస్థల ఎసీ గదల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు- ఇలా సాదాసీదా కార్మికుల్లాగా, రైతు కూలీల్లాగా రోడ్ల మీద ఆందోళనలేమిటి?