Tag: Purandheswari

‘కమలం’బాటి పురంధేశ్వరి

పేరు : దగ్గుబాటి పురంధేశ్వరి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘కాషాయ’ మంత్రి (‘ఖద్దరు’ మంత్రిగా చేసేశాను. ఇక చేయాల్సింది అదే కదా! ‘అన్న’ కూతురుగా అన్ని సార్లూ సెక్యులర్‌ పార్టీలోనే మంత్రి పదవి చేయాలని లేదు.)

ముద్దు పేర్లు :రాజకీయ ‘దురంధేశ్వరి'( బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి, విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి ఎంత సునాయాసంగా రాగలిగానో, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి కూడా అంతే సులువుగా వచ్చాను.) ‘కమలం’ బాటి పురంధేశ్వరి

‘మీ నాన్న మాజీ యా?’

మీ నాన్న మొన్న నాదెండ్ల మనోహర్‌ స్పీకరయ్యారు.

నిన్న కోట్ల సూర్యప్రకాశ రెడ్డి కేంద్రమంత్రయ్యారు

నేడు మర్రి శశిధర రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ముగ్గురి తండ్రులూ ఒకప్పడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులే.ఈ మాజీ ముఖ్యమంత్రులు కేవలం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులయి వుండాలా?

ఈ ‘రిజర్వేషన్‌’ వారి కొడుకులకేనా? కూతుళ్ళకు కూడా వర్తిస్తుందా?

ఈ రెండూ ప్రశ్నలూ వేయగానే గుర్తుకు వచ్చే పేరు- దగ్గుబాటి పురంధరేశ్వరి.

కాంగ్రెస్‌ తదుపరి పాచిక: మహిళా ముఖ్యమంత్రి?

కేవలం ముగ్గురు మహిళల్ని ఎదుర్కోవటానికి కాంగ్రెస్‌ కు ఇతర మహిళా నేతలు అవసరమవుతారు.

ఇప్పటికకే రేణుకా చౌదరి విజయమ్మ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

కానీ, ఆమెకు రాష్ట్రవ్యాపితంగా అంత ప్రజాదరణ వుండక పోవచ్చు.

ఈ ముగ్గురు మహిళల ప్రభంజనం ఇంకా పెరిగితే, ముఖ్యమంత్రి స్థానంలో కూడా మహిళానేతను కూర్చోబెట్టే ఆలోచన కాంగ్రెస్‌ పార్టీ చెయ్యవచ్చు.

తామే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవటం కోసమయినా ఈ పని చెయ్యాల్సి వస్తుంది.