వేరే గ్రహం నుంచి భూమ్మీదకు దిగి, వెతుక్కుంటూ, వెతుక్కుంటూ భారత దేశం వచ్చిన ‘పీకే'(అమీర్ ఖాన్), ఈ దేశంలో తప్ప ఎక్కడయినా వుంటానంటున్నాడా? ఆ సినిమాలో అన్ని మత ఛాందసాలకూ, సమానంగా తలంటు పోసిన అమీర్ పట్ల, ఒక మతానికి చెందిన ఛాందసులే ‘అసహనం’ ప్రదర్శించారా? ఇంతకీ దేశం వెళ్ళాలనే ఆలోచన ఆయనకు వచ్చిందా? లేక హిందువుగానే పుట్టిన తన భార్య(కిరణ్)కు వచ్చిందా?
Tag: rajnath singh
‘నరేంద్ర’ నాథ్ సింగ్!
పేరు : రాజ్ నాథ్ సింగ్
ముద్దు పేర్లు : ‘నరేంద్ర’ నాథ్ సింగ్( పేరు కు పార్టీలో నా బృందాన్ని ‘టీమ్ రాజ్ నాథ్’ అంటారు. కానీ ఈ మధ్య ఓ ప్రముఖ దినపత్రికలో ఓ కార్టూను చూశాను. పార్లమెంటరీ బోర్డులో వున్న సభ్యులందరికీ నరేంద్ర మోడీ ముఖాలే( మాస్క్‌లే) వున్నాయి. నేను కూడా మినహాయింపు కాదు.
విద్యార్హతలు : చదివింది ‘భౌతికం’ (భౌతిక శాస్త్రం) అలోచన ‘వైదికం’. అందుకే నేను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయనప్పడు పాఠ్యపుస్తకాల్లో మామూలు గణితం తీసి పారేసి, వేద గణితం పెట్టాను. లేక పోతే ఏమిటి చెప్పండి! ఎవరు బడితే వారు ‘విజన్ 2020’ అంటారు. నా విజన్ అది కాదు. క్రీ.పూ 1010. అప్పటికి సమాజాన్ని నడిపించాలంటే మనకి వేదాలే