పురాణాన్ని నమ్మించినట్లే పుకార్లనీ నమ్మించేస్తున్నారు. గోవుల్ని వధిస్తున్నారని పుకారు; పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని పుకారు; చేతబడులు చేస్తున్నారని పుకారు. నమ్మించెయ్యగా, నమ్మించెయ్యగా, జనానికి కూడా నమ్మకం వ్యసనం అయిపోతుంది.. తాగించగా తాగించగా తాగుడు అలవాటు అయిపోయినట్లు. ఆ తర్వాత జనం నమ్మటానికి సిధ్దంగా వుండి పుకారు కోసం ఎదురు చూస్తారు. తాగుడు అలవాటయి, తాగటానికి కారణం వెతుక్కున్నట్లు.…