బహుముఖీన ప్రజ్ఞావంతుడు సతీష్‌చందర్.ప్రాథమికంగా అతను కవే అని నా తలంపు. ‘పంచమ వేదం’తోనే కొత్త దారి తీశాడు. ఆర్ద్రత, ఆలోచనాత్మకత, ప్రగతిశీలత, నిర్మాణ సౌందర్యం అతని కవిత్వంలో ప్రస్ఫుటం అవుతాయి. ఆ సాధన, శక్తి కథారచనలో ఎంతో ఉపయోగపడ్డాయి. కొంతమంది అనుకుంటారు, కథల్లో కవితాత్మకత అవసరం లేదని. కానీ ప్రజ్ఞావంతుడైన కవికి ఔచిత్యం, భాషాధికారం, శైలీ…