Tag: Satish Chandar’s 17th book ‘Nigraha Vaakyam

మూడు దశాబ్దాలు! ఆరు అస్తిత్వాలు!!

తినేటప్పుడు కబుర్లు చెబితే అమ్మకు నచ్చేది కాదు. ‘నోరు మూసుకుని తిను,’ అనేది. ఈ వాక్యం విన్నప్పుడెల్లా, నవ్వొచ్చేది. కానీ, నచ్చేది. వెంటనే ఈ వాక్యానికి పేరడీలు చేయాలనిపించేది. ‘కళ్ళు మూసుకుని చూడు’, ‘కాళ్ళు ముడుచుకుని పరుగెత్తు’ ‘చేతులు కట్టుకుని చప్పట్లు కొట్టు.’

అమ్మ వాక్యాన్ని అక్షరబధ్ధంగా అమలు చెయ్యటానికి నేనేమన్నా పార్థుణ్ణా? వొళ్ళు వంచి సంపాదించుకొచ్చినట్లు, విల్లు వంచి తెస్తాడు ద్రౌపదిని. ఆ విషయం శుధ్ధ వచనంలో చెప్పొచ్చు కదా! ‘అమ్మా! పండు తెచ్చానే’ అని కవిత్వం వెలగబెడతాడు. ఆమెకు మాత్రం అది వచనంలాగానే అనిపిస్తుంది. ‘అయిదుగురూ పంచుకోండి’ అంది. కొన్ని విషయాల్లో మాతృవాక్పరిపాలకులయిన పాండవులు, వాక్యాన్ని వాచ్యంగా తీసుకుని అమలు జరిపేశారు.

సతీష్ చందర్ ’నిగ్రహవాక్యం‘ మూడు దశాబ్దాల తెలుగు సాహిత్యానికి నిలువుటద్దం

నా (సతీష్ చందర్) 17 వ పుస్తకం ’నిగ్రహ వాక్యం‘ (సాహిత్య విమర్శ) గ్రంధాన్ని అక్టోబరు 29 సాయింత్రం సుందరయ్య విజ్నాన కేంద్రం, మినీ హాలులోప్రముఖ కవి కె.శివారెడ్డి ఆవిష్కరించారు. సభకు దిగంబరకవితోద్యమ సారధి నగ్నముని అధ్యక్షత వహించారు. మొత్తం నాతో పాటు పది మంది మాట్లాడారు. ( నాది ’స్పందన‘ సమర్పణే లెండి. నేను వందన సమర్పణను అలా అంటుంటాను.) అయినా ఎవరి పరిశీలన వారు చేశారు