ఒకడేమో కడుపు కోసేస్తానంటాడు; ఇంకొకడేమో గోతులు తీసేస్తానంటాడు; మరొకడేమో మక్కెలు విరగ్గొడతానంటాడు; అదీఇదీ కాక టోపీపెట్టేస్తానంటాడు ఓ తలకాయలేని వాడు. ఇవన్నీ పిచ్చి ప్రగల్బాలు కావు. కలలు. పిల్లకాయలు కనే కలలు.కలలు కనండీ, కలలు కనండీ… అనీ కలామ్ గారు పిలుపు నిచ్చారు కదా- అని, ఇలా మొదలు పెట్టేశారు. పనీ పాట లేక పక్క ఫ్లాట్లలో పిల్లల్ని పోగేసి, కలామ్ గారడిగినట్లే, మీరేం కావాలనుకుంటున్నార్రా అని అడిగాను. ఒక్క వెధవ తిన్నగా చెప్పలేదు.