Tag: Satish Chandar’s political satire

బ్యాలెట్ పేపరా? చార్జి షీటా?

‘పెళ్ళంటే మూడు ముళ్ళనుకున్నావా…? లేక మూడు విడాకులనుకున్నావా?‘
సంపన్నవతీ, సౌందర్యవతీ అయిన మూడుపదుల మహిళను ప్రశ్నించాడు లాయరు- బోనులో నిలబెట్టి.
‘ముళ్ళూ కాదు, ఆకులూ కాదు. ముడుపులు. పెళ్ళంటే ముడుపులు… అని నేననుకోలేదు. నన్నుకట్టుకున్న మొగుళ్ళు అనుకున్నారు. .
మహిళ అయి వుండియూ, ముద్దాయి అయివుండియూ ఆమె తలయెత్తి సమాధానం చెప్పటంతో లాయరికి చిర్రెత్తుకొచ్చింది.
‘అంటే కట్నమనా…?’
’ముడుపులనే… ఆడదాని దగ్గర పుచ్చుకుంటే కట్నమవుతుంది. అడ్డమయిన వాడి దగ్గరా పుచ్చుకుంటే లంచమవుతుంది.‘

రాజకీయాల్లో ‘క’ గుణింతం!

‘గురూజీ?’
‘వాట్ శిష్యా!’

‘తెలంగాణ ఉద్యమం అంతా ‘క’ గుణింతంతో నడుస్తున్నట్టున్నది..?’
‘అంటే ఏమిటి శిష్యా..!?’

‘ఏముందీ..? తెలంగాణ ఉద్యమ నేతల పేర్లు తీసుకోండి. ఇప్పుడు ‘కేకే’ ఉన్నారు. నిన్నటి దాకా ‘కాకా’ కూడా చురుగ్గా వుండేవారు. ఇక ‘కే’సీఆర్ కుటుంబమంతా ‘క’ గుణింతమే.