
‘రేయ్ ఈ కాఫీడేలో కూర్చోవాలంటే నాకు బోరు కొడుతోంది రా!’ అని ఒక ప్రియురాలు గారాబాలు పోతోంటే-
‘కాఫీ డే- కాక పోతే, టీ నైట్ వుంటుంది. అక్కడ కూర్చుందామా?’ అని ఊర్కోబెట్టాడు ప్రియుడు.
‘చంపుతాను- ఆ చావు వెటకారం ఆపక పోతే..! ముందు ఇక్కడనుంచి లేచి పోదాంరా ఇడియట్!.’
‘అప్పుడే- లేచిపోదాం- అంటే బాగుండదు. మన ఎఫైర్ మొదలయి రెండు రోజులు కూడా కాలేదు.’ నచ్చచెప్పబోయాడు.