సినిమాలే కాదు, రాజకీయాలు కూడా సెంటిమెంటు మీద ఆడేస్తాయి. తెలుగుప్రేక్షకుడి దృష్టిలో సెంటిమెంటు అంటే మరేమీ కాదు, ఏడుపు. అవును ఉత్త ఏడుపే.
ఎంత చెట్టుకు అంత గాలి లాగా, ఎంత డబ్బుకు అంత ఏడుపు. అదే హైదరాబాద్. ముఫ్పయి రూపాయిల పెట్టి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లో వున్న సినిమాలోనూ ఏడ్వవచ్చు. నూటయాభయి రూపాయిలు పెట్టి మల్లీప్లెక్స్ థియేటర్లోనూ ఏడ్వవచ్చు. కాళ్ళు ముడుచుకుని. ముందుకుర్చీల్లో కూర్చున్న తలల మధ్యనుంచి చూస్తూ ఏడ్వవచ్చు. వెల్లికిలా చేరపడి, కాళ్ళుతన్ని పెట్టి ‘రిక్లయినర్’ ఏడ్పూ ఏడ్వవచ్చు.