అధినేత వేరు, నేత వేరు.
ఇద్దరికీ మధ్య చెయ్యి ఊపటానికీ, చేతులు జోడించటానికీ వున్నంత తేడా. అది రోడ్ షో కావచ్చు, బహిరంగ సభ కావచ్చు. ఇద్దరూ ఆ తేడాను పాటించాలి.
ఉదాహరణకి సోనియా గాంధీ, కిరణ్కుమార్ రెడ్డీ ఒకే వేదిక మీదకొచ్చారనుకోండి. వారు మాట్లాడే భాషలే కాదు, దేహ భాషలు కూడా వేరు వేరుగా వుంటాయి. జనం వైపు తిరిగి సోనియా చెయ్యి ఊపితే, కిరణ్ కుమార్ రెడ్డి ఏడుకొండలవాడి ముందు చేతులు జోడించినట్టు అదే జనానికి నమస్కరించాలి.