వంద సీట్లు. వెయ్యి కోట్లు. లక్ష ఫీట్లు.
ఇవీ బీసీల వోట్ల కోసం చంద్రబాబు పాట్లు.
ఇది విజన్ 2020 కాదు, రీజన్ 2014.
అనుమానం లేదు. ఇది ఎన్నికల గణితమే. ఆయన లెక్కల్లో మనిషి. ఇంతకు ముందు ఎన్నికల్లో ఇలాగే ‘నగలు బదలీ’ లెక్కలు వేశారు. ‘ఆల్ ఫ్రీ’ కూడికలు వేశారు. కానీ జనానికి ‘తీసివేత’లే అర్థమయ్యాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ‘తీసి వేశారు’.