జెండా ఒక్కటే.. రంగు ఒక్కటే.. సిధ్ధాంతం ఒక్కటే. ఎజెండాయే వేరు. రెండూ కమ్యూనిస్టు పార్టీలే. ఒకటి సీపీఐ, మరొకటి సీపీఎం. రాజకీయంగా ’ఎడమ‘ వైపున వుండేవే.. కానీ ఎడమ ఎడమ గా వుంటాయి. తెలంగాణ ఉద్యమంలోనూ రెంటివీ రెండు దారులు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో నూ అంతే. సీపీఐ ’కూటమి’లో చేరితే, సీపీఎం ’బహుజన ఫ్రంట్‘ ఏర్పాటు చేసింది. అధికారంలో వున్న టీఆర్ఎస్ ను రెండూ విమర్శిస్తున్నాయి. కానీ టీఆర్ ఎస్ ను గద్దె దించాలని కేవలం సీపీఐ మాత్రమే కోరుకుంటుందా?
ఈ అంశం పై మాట్లాడటానికి సీపీఐ తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ’టాక్ టు మీ‘ షోకు వచ్చారు.