
పేరు : జి.కిషన్ రెడ్డి
దరఖాస్తు చేయు ఉద్యోగం: భావి(2019) తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి.( ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించే ఆనవాయితీ మా పార్టీకి ఎలాగూ వుంది కాబట్టి, తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటించవచ్చు. )
ముద్దు పేర్లు : ‘క్వశ్చన్’ రెడ్డి( అసెంబ్లీలో నిత్యమూ ప్రతి పక్షంలో వుండటం వల్ల ప్రశ్నించటం అలవాటయి పోయింది. సమాధానాలతో నాకు పని వుండదు అధ్యక్షా! ఇంతకీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చినా, నేను తెలంగాణ అంతా తిరిగినా మా పార్టీ తెలంగాణలో ఎందుకు ఓడిపోయినట్లు అధ్యక్షా?)
‘విద్యార్హతలు : బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ పోస్ట్ మార్టెమ్ ( కాబట్టే తెలంగాణలో బీజేపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించగలిగాను. అఫ్ కోర్స్ కారకుల్లో నేనూ ఒకణ్ణని కొందరు సభ్యులు తేల్చారు.)