‘గ్రేటర్’! కొత్త ఏడాది(2016) ఏ మాటతోనే మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పౌరులందరూ ‘హ్యాపీ న్యూయియర్’ అని ఒకరినొకరు అభినందించుకోవచ్చు. అందు వల్ల ఆనంద పొందవచ్చు. కానీ ఈ రాష్ట్రాలలో నేతల్ని ఆనందింప చెయ్యాలంటే మాత్రం ‘హ్యాపీ న్యూయియర్’ అని అనకుండా ‘గ్రేటర్ న్యూయియర్’ అనాలి. అప్పుడు విన్న నేత ముఖం వెలుగుతుంది. తెలుగు సంవత్సరాలకు నెంబర్లతో పాటు, పేర్లు కూడా వుంటాయి. కానీ ఇంగ్లీషు సంవత్సరాలకు అంకెలు మాత్రమే వుంటాయి. కానీ 2016కు మాత్రం ఈ రెండు రాష్ట్రాల వారూ పేరు కూడా పెట్టుకోవచ్చు. అదే ‘గ్రేటర్’ నామ సంవత్సరం.
Tag: TRS
చేసేది చెలిమి! తీసేది కత్తి!!
కూలిపోతున్నానని తెలిసి కూడా కులాసాగా వున్నానని చెప్పటం కష్టమే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇదే స్థితిలో వుంది. కాంగ్రెస్ పై వోటర్ల విశ్వాసం సన్నగిల్లిందని, సర్వేల సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడుపార్లమెంటు ఎన్నికలు వస్తే, రాష్ట్రం వరకూ (మొత్తం 42 స్థానాల్లో) కాంగ్రెస్ కు వచ్చే సీట్లు ఏడు లేదా ఎనిమిది అని చెబుతున్నారు. 2009 ఎన్నికలలో 33 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీకి ఎంత నిరుత్సాహం కలగాలి?
కదలని’చెయ్యి’- వదలని’గులాబి’!!
తెలంగాణ సమస్య తెగిపోతుంది, మబ్బు విడిపోతుంది.
ఇది తెలంగాణలో ఆశావాదుల జోస్యం.
తెలంగాణ సమస్య జటిలమవుతుంది. మళ్ళీ రెండు ప్రాంతాల్లో చిచ్చు రేగుతుంది.
ఇది తెలంగాణలోని నిరాశావాదుల భయం.
బహుశా, కేంద్రం నిర్ణయం రెంటికీ మధ్య వుంటుంది