Tag: Turning Points by Kalam

ఊరించిన విషయానికి కిక్కెక్కువ!

అబధ్ధం చురుకయినది. పుట్టగానే పరుగెత్తుతుంది.

నిజం సోమరి. వెళ్ళవచ్చులే- అని బధ్ధకిస్తుంది.

పుకారు కున్న స్పీడు, వార్తకు వుంటుందా? పుకారును వ్యాప్తి చేయటానికి ప్రత్యేకించి ప్రసార సాధనం అవసరం లేదు. దానంతటదే వ్యాప్తి చెందుతుంది. కానీ, వార్తకంటూ ఒక సాధనం వుండాలి.

అందుకే అంటారు మరి- ‘సత్యం చెప్పులు వేసుకునేలోగా అసత్యం లోకం చుట్టి వస్తుందని’.

కారణం మార్కెట్‌. అబధ్దానికున్న డిమాండ్‌, నిజానికి వుండదు. అబధ్ధానికి ఎదురువెళ్ళి స్వాగతిస్తారు. అసత్యవాక్కులను ఎగబడి కొంటారు.