అలకలు కొన్ని; కినుకలు కొన్ని; భజనలు కొన్ని..వెరసి ప్రపంచ తెలుగు మహాసభలయ్యాయి. ఈ ఏడాది(2017) చివర్లో మొత్తానికి హైదరాబాద్ మోతెక్కిపోయింది. కోట్ల వ్యయం; లక్షల జనం; వేల కవులూ, రచయితలూ, భాషాభిమానులూ. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి(తెలుగువాడు కావటం యాదృచ్ఛికం.) శ్రీకారం చుడితే, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్(తెలుసుకున్న తెలుగు చరితతో) ‘శుభం’ కార్డు వేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు:…