స్వామి తలచుకుంటే కేసులకు కరువా? ‘కలహభోజనుడు’ సుబ్రహ్మణ్య స్వామి అంటేనే వివాదం. ఆయన ఏ పార్టీలో వున్నా ‘వన్ మ్యాన్ ఆర్మీ’ (ఏక సభ్య సైన్యం) లాగా వుంటారు. కూపీలూ లాగటంలోనూ, లొసుగులు వెతకటంలోనూ దిట్ట. అయితే అన్ని కూపీలూ నిలబడవు. కొన్ని వీగిపోతుంటాయి. ఆయన ఎవరి మీదయినా గురిపెట్టారంటే, ఇక వారి చుట్టూనే తిరుగుతుంటారు. రాజకీయంగా ఆయనకు కాంగ్రెస్ మీద ఎప్పుడూ ఒక కన్ను వేసే వుంచుతారు. ఈ మధ్య కాలంలో ఆయన కారణంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రెండు సార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.