Tag: YSR Congress Party

కిరణ్ ను గిల్లితే, బాబు గొల్లుమన్నారు

పెళ్ళీ, ప్రజాస్వామ్యమూ రెండూ ఒక్కటే. రెండూ రెండు తంతులు. తంతులో తంతులాగా, పెళ్ళితంతులో కాశీ తంతు ఒకటి వుంటుంది. శుభమా- అని పెళ్ళి జరుగుతుంటే, పెళ్ళి కొడుకు తాటాకు గొడుగు ఒకటి పట్టుకుని , చెక్క చెప్పులు వేసుకుని కాశీకి పోతానంటాడు. అప్పుడు అతని బావమరది (అనగా పెళ్ళికూతురు తమ్ముడు) వచ్చి పెళ్ళికొడుకు గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి, ‘బావగారూ, కాశీకి వెళ్ళకండి, మా అక్కను ఏలుకోండి. ప్లీజ్‌’ అంటాడు. అప్పుడు ఆ పెళ్ళికొడుకు కాస్త బెట్టు చేసి, వెనక్కి వచ్చేసి, పెళ్ళికూతురు చెయ్యి పట్టేసుకుంటాడు. ఈ

దూకమంటే దూకేది దూకుడు కాదు.

దూకుడు!

ఒక సినిమా కాదు, ఒక ఆట. ఊపిరి బిగబట్టి చూడాల్సిన రాజకీయ క్రీడ. ఇది హై జంపూ కాదు, లాంగ్‌ జంపూ కాదు. ‘లో’ జంపు.

ఈ జంపులో ఎగరటం వుండదు. కేవలం పడటమే.

పడేటప్పుడు జాగ్రత్తగా పడాలి. లాభదాయకంగా పడాలి. క్షేమదాయకంగా పడాలి. ప్రయాణిస్తున్న పార్టీ ఫ్లయిట్‌ లాంటిదయితే, పారాచ్యూట్‌ కట్టుకుని పడాలి; పడవలాంటిదయితే ట్యూబ్‌ కట్టుకుని పడాలి.

పడితే నిజంగా హైహీల్స్‌ చెప్పులతో నడిచే హీరోయన్‌ పడ్డట్టు, సరాసరి హీరో గుండెల మీద పడాలి.

‘గాంధీ’ని చూపితేనే, వోటు!!

అభ్యర్థి జేబులోని అయిదువందల రూపాయి నోటు తీసి, వోటరు చేతిలో పెట్టి- ‘చూస్కో గాంధీ వున్నాడో? లేదో?’ అంటాడు. తళ తళ లాడే నోటును కళ్ళ దగ్గర పెట్టుకుని, బోసినవ్వుల గాంధీని చూసుకుని- ‘ఇప్పుడు నమ్ముతాను నువ్వ గాంధేయ వాదివని. నా వోటు నీకేలే ఫో!’ అంటాడు.

అవును. మరి. గాంధీ ముఖం చూసి వోటేస్తున్నారు కానీ, అభ్యర్థుల్ని చూసి వేస్తున్నారా?

వన్-టూ-టెన్ జగనే..జగను

నెంబర్ వన్ జగన్‌, టూ జగన్‌, త్రీజగన్‌… టెన్‌కూడా జగనే. వైయస్సార్‌ కాంగ్రెస్‌లో నాయకత్వ పరిస్థితి అది. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో వైయస్‌ రాజశేఖర రెడ్డి కూడా అలాగే వున్నారు. వోటర్లను సమ్మోహితుల్ని చెయ్యటానికి పార్టీలో అగ్రతార అలాగే కనిపించాలి. ఇదే ఆకర్షణ. కానీ, పార్టీనిర్మాణానికి ఇది అడ్డంకి అవుతుంది. ప్రతీ పనికీ కార్యకర్తలు అగ్రనేత ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి చిన్న విషయంలోనూ అగ్రనేత తల దూర్చాల్సి వుంటుంది. ఈ పనే ఇప్పుడు జగన్‌ చేస్తున్నారు. జగన్‌ ఆస్తుల కేసులో సిబిఐ జగన్‌ను అరెస్టు చేసి, జైలు పాలు చేస్తే, ఆయన తర్వాత ఆ పాత్రని ఏ నేతలు పోషిస్తారు? రాజకీయాల్లో సంక్షోభం కూడా అవకాశమే. దీనిని ఉపయోగించుకోవటానికి జగన్‌ తర్వాత ఎవరు సిద్ధంగా వున్నారు?