తడారిన ఎడారి

ఎడారి(moyan brenn)

(రోజూ చూసేవే.కానీ చూడనట్టు చూడాలనిపిస్తుంది. ఎరిగినదారే.ఎరగనట్టుగా వెతుక్కోవాలని పిస్తుంది.అప్పడే అంతా వింత వింతగా, కొత్త,కొత్తగా.. వుంటుంది. లేక పోతే బతికిన బతుకే,తిరిగి తిరిగి బతుకుతున్నట్లనిపిస్తుంది.)

తడారి పోయాక
తటాకమయినా,
దప్పికొన్నవారికి-
ఎడారే!
అనురాగం
ఆవిరయ్యాక
అమ్మయినా
కొయ్యబొమ్మే!
-సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

1 comment for “తడారిన ఎడారి

Leave a Reply