Month: December 2017

నాడు పాటను మెచ్చి.. నేడు పద్యానికి మొక్కి.!

అలకలు కొన్ని; కినుకలు కొన్ని; భజనలు కొన్ని..వెరసి ప్రపంచ తెలుగు మహాసభలయ్యాయి. ఈ ఏడాది(2017) చివర్లో మొత్తానికి హైదరాబాద్‌ మోతెక్కిపోయింది. కోట్ల వ్యయం; లక్షల జనం; వేల కవులూ, రచయితలూ, భాషాభిమానులూ. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి(తెలుగువాడు కావటం యాదృచ్ఛికం.) శ్రీకారం చుడితే, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(తెలుసుకున్న తెలుగు చరితతో) ‘శుభం’ కార్డు వేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు:…

Kovind Plays with 3 ‘B’S

Hyderabad can be defined in 3 ‘B’s: Biryani, Badminton and Bahubali. This was the First comment from the First Citizen of the country for the First official official visit to the City. Yes. Ramnath Kovind, the President of India didn’t…

ముద్దుల తనయుడికి ‘ముళ్ళ’ వారసత్వమా..!?

వారసత్వమే కావచ్చు. అందరికీ ఒకలాగా అందదు. కొందరికి పువ్వులతో వస్తుంది. ఇంకొందరికి ముళ్ళతో వస్తుంది. సోనియా గాంధీకి రెండో పధ్ధతిలో వచ్చింది.

వ్యూహం లేని గ్లామర్‌.. వాసన రాని పువ్వు!

ఒకప్పుడు గ్లామరే రాజకీయం. నేడు వ్యూహమే సర్వస్వమయిపోయింది. కేవలం వ్యూహమే వుండి, జనాకర్షణ లేకపోయినా దిగులు లేదు. తర్వాత అదే జనాకర్షణగా మారుతుంది. ఉత్త జనాకర్షణ వుండి వ్యూహం లేక పోతే.. ఆ మెరుపు ఎన్నాళ్ళో నిలవదు. జాతీయ రాజకీయాల్లో రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోడీల విషయంలో అదే జరిగింది. రాహుల్‌ గాంధీకి జనాకర్షణ అన్నది…

‘శంకల’ అయ్యర్‌!

పేరు :మణి శంకర్‌ అయ్యర్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: కేంద్ర వివాదాస్పద వ్యాఖ్యల శాఖా మాత్యులు. (బీజేపీ ఎలాగూ ఇవ్వదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక, ఇలాంటి శాఖను ఏర్పాటు చెయ్యటానికి వెనకాడదు కానీ, ఆ పదవి నాకివ్వటానికి ఇష్టపడదు. ఇంకేదన్నా సర్కారు వస్తే ఇస్తుందేమో చూడాలి.) వయసు : ఏం? ఎందుకా సందేహం? వయసుకు తగ్గట్లు…

తెలుగు లో తిట్టు లేదా? తెలుగు మీద పట్టు లేదా?

‘మీరెవరు?’ ప్రశ్నే. సాదాసీదా ప్రశ్నే. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు,ఎవరో ఒకరికి ఈ ప్రశ్న ఎదురవుతుంది. స్థలమూ, సందర్భమూ సమాధానాన్ని నిర్ణయిస్తాయి. స్థలం: మనదేశంలోని ఒకానొక గ్రామం. సందర్భం: ఆ ఊరికి కొత్త కావటం. అడిగిన వ్యక్తి: ఆ పల్లెలో ఓ పెద్దాయన. ఆ కొత్త వ్యక్తినుంచి వచ్చే సమాధానాలు ఏయే రకాలుగా వుండవచ్చు.…