Category: Essays

తెలుగు లో తిట్టు లేదా? తెలుగు మీద పట్టు లేదా?

‘మీరెవరు?’ ప్రశ్నే. సాదాసీదా ప్రశ్నే. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు,ఎవరో ఒకరికి ఈ ప్రశ్న ఎదురవుతుంది. స్థలమూ, సందర్భమూ సమాధానాన్ని నిర్ణయిస్తాయి. స్థలం: మనదేశంలోని ఒకానొక గ్రామం. సందర్భం: ఆ ఊరికి కొత్త కావటం. అడిగిన వ్యక్తి: ఆ పల్లెలో ఓ పెద్దాయన. ఆ కొత్త వ్యక్తినుంచి వచ్చే సమాధానాలు ఏయే రకాలుగా వుండవచ్చు.…

మహరాజునే వెలి వేస్తే….!?

వేదం వినాలనీ, వేదం అనాలనీ..నేడు పెద్దగా ఎవరికీ అనిపించక పోవచ్చు. అర్థం తెలుసుకోవాలనే యావ కూడా ఎవరికీ వుండక పోవచ్చు. పెద్ద పెద్ద ఉత్సవాల్లో, కడకు సర్కారీ ఉత్సవాల్లో వేద మంత్రోచ్చరణలు లేక పోతే వెలితిగా భావిస్తారేమో కానీ, తీరా పఠిస్తే పట్టించుకోరు. మీడియా ప్రతినిథులు కూడా ఉత్సవాల్లో నాయకులేం మాట్లాడతారో వింటారు కానీ, వేద…

దొందూ దొందే!

అటు చంద్రుడు; ఇటు చంద్రుడు. ఇద్దరూ ఇద్దరే.

పేరులోనే కాదు, తీరులో కూడా ఇద్దరికీ పోలికలు వున్నాయి:

పూర్వ విద్యార్ధులు: చంద్రబాబే కాదు, కేసీఆర్‌ కూడా ఎన్టీఆర్‌ ట్రస్టులో చదువుకున్న వారే. ఎదురు తిరిగిన వారిని, ఎలా ‘కూర్చో’ బెట్టాలో తెలిసిన వారు. కొందరికి పదవులిచ్చి ‘కుర్చీలు’ వేస్తారు; ఎందరికో పదవులు ఇస్తామని ఆశ చూపి ‘గోడ కుర్చీ’లు వేస్తారు. దాంతో తమకి వ్యతిరేకుల్లో ఎవరూ’లేవరు’.

గోరంత వినోదం! కొండంత వాస్తవం!!

ఒకప్పుడు కళకీ, కామర్స్‌కీ పొంతన కుదిరేది కాదు. అందుకని సినిమాలు ఆర్ట్‌ చిత్రాలు, కమర్షియల్‌ చిత్రాలు- అని రెండు పాయల్లాగా వుండేవి. కానీ ఇప్పుడు రెండూ దాదాపు కలసిపోయాయి. అయినా, అప్పుడప్పుడూ కళ మోతాదు కాస్త పెంచి ‘ఫీల్‌ గుడ్‌’ సినిమాలు తీస్తుంటారు. అలాంటి ఒక ప్రయత్నమే ‘పరంపర’. బాలీవుడ్‌, టాలివుడ్‌లలో ఓ పదిహేను చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన మధు మహంకాళి, స్వీయ దర్శకత్వంలో సొంతంగా ఈ సినిమా తీశారు.

‘చుక్కల్ని చూపించిన’ క్రిస్టఫర్‌ నోలాన్‌!

గూడు చెదిరిన వాడు ఏం చేస్తాడు? ఇంకో గూడు వెతుక్కుంటాడు. మానవాళికి గూడు భూమి. భూమే చెదరిపోతే..? ఇంకో భూమిని వెతుక్కోవాలి. అవును. భూమిలాంటి గ్రహాన్ని వెతుక్కోవాలి. అలాంటి గ్రహం ఇంకొకటి వుంటుందా? మన సౌర కుటుంబంలో వుండక పోవచ్చు. గగనాంతర రోదసుల్లో, ఇతర తారల పరిధుల్లో వుండవచ్చు. ఇప్పటిదాకా వున్న ఖగోళ జ్ఞాన పరిమితి మేరకు మనం పోల్చుక్ను గ్రహాలు రెండువేలు. ఇందులో అత్యంత సమీపగ్రహం మనకు వెయ్యికాంతి సంవత్సరాల దూరం. అలాంటిది భూమిని పోలిన గ్రహం, భూమిలాంటి వాతావరణమున్న గ్రహం, మనిషి తనను కొనసాగించుకోవటానికి వీలున్న గ్రహాన్ని వెతుక్కుంటూ పోతే.. ఎలా వుంటుంది? ఎలా వుండమేమిటి? క్రిస్టఫర్‌ నోలాన్‌ తీసిన ‘ఇంటర్‌స్టెల్లార్‌’ లాగా వుంటుంది.

బొమ్మను గీసి, పాత్రను చేసి..!

బాపూ,రమణలు మీడియాకు ఇంటర్య్యూలు ఇచ్చేవారు కారు. ప్రచారానికి పది కిలోమీటర్లలోనే ఇద్దరూ వుండేవారు. తమకి నచ్చని సంభాషణలు ఎవరయినా చేస్తే ఇద్దరూ ముడుచుకుపోతారు. బాపు అయితే పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోతారు. వారు ఎవరితో మాట్లాడినా పది,పదిహేను నిమిషాల్లోనే మౌనం లోకి వెళ్ళిపోతారు. అయితే అనుకోకుండా 2011జులై నెలాఖరున ఆయన్ని నేనూ, నా మిత్రుడూ కలిసినప్పుడు ఆయన ఎక్కువ సేపు మాతో ముచ్చటించారు

తీసిందే బొమ్మా? చూసింది కాదా..?

వామ్మో!

తిట్టేసుకుంటున్నారు; కొట్టేసుకుంటున్నారు; తన్నేసుకంటున్నారు.

తాను తీసిందే సినిమా అనీ దర్శకుడూ, తాను రాసిందే సమీక్ష అని సమీక్షకుడూ ఒకటే తన్నులాట. (తన్నులెన్ను వారు తమ తన్నులెరుగరు!) ఎంత గొప్ప సినిమా తీసినా, చూడ్డానికి ప్రేక్షకుడు ఒకడుండాలని దర్శకుడూ, ఎంత మహా సమీక్ష చేసినా చదవటానికి పాఠకుడంటూ ఒకడుండాలని వీక్షకుడూ – ఈ తన్నులాటలో మరచిపోయారు. యథా సినిమా, తధా సమీక్ష. ఈ సూత్రీకరణని తిరగేసినా అర్థానికి వచ్చిన ముప్పేమీ లేదు.

తెరచుకోనున్న ‘ఫ్రంట్‌’ డోర్‌!

రెండు రాష్ట్రాలుగా విడిపోనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోయిన వెంటనే, అసలు రాజకీయాలు మొదలయ్యాయి. ఇవి రెండు స్రవంతుల్లో నడుస్తున్నాయి. ఒకటి: రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎలా, ఎవరు ఏర్పాటు చెయ్యాలి? రెండు: రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన పార్లమెంటు సీట్లను కేంద్రంలో ఎవరికి ఇవ్వాలి? ఎన్డీయేకా? కాంగ్రెస్‌కా? ఇంకా గర్భస్త శిశువుగానే వున్న మూడో ఫ్రంట్‌ కా?

శీను వైట్లా, కథ లేదెట్లా?

కొసరు ముందు; అసలు తర్వాత.

కామెడీ ట్రాక్‌ ముందు, కథ తర్వాత.

అది యెట్లా- అంటే శీను వైట్లా-అనాల్సి వస్తుంది.

పూర్వం టిఫిన్లు తినటం కోసం రెస్టారెంట్లకు వెళ్ళే వారు. కానీ ఈ మధ్య ‘బ్రేక్‌ ఫాస్ట్‌’ చేయటంలో కూడా ట్రెండ్‌ మారింది. చట్నీలు భోంచెయ్యటం కోసమే హొటళ్ళకు వెళ్తున్నారు. హోమియో గుళిక లాంటి ఇడ్లీ ముక్కను ఆరగించటానికి గంగాళాల కొద్దీ చట్నీలను వడ్డిస్తారు. దాదాపు సినిమాలో వైట్ల తెచ్చిన ట్రెండ్‌ ఇదే.

రెండు గంటల హాస్యానికి, అర్థ గంట కథను జోడిస్తారు.

తెర మీదకు తమిళ ప్రధాని?

దేశం లో అత్యున్నత పదవి ఏది?

పరీక్షల్లో ఈ ప్రశ్న అడిగితే పిల్లలు ఈ సారి తెల్ల ముఖం వెయ్యాల్సిందే.

గతంలో లాగా, హోదాకు రాష్ట్రపతి, అధికారానికి ప్రధానమంత్రి- అని రాస్తే తప్పయ్యే ప్రమాదం వుంది. ఎలా తప్పూ- అంటే చెప్పలేం. చాలాకాలం పదవుల ఔన్నత్యాన్ని రాజ్యాంగమే నిర్ణయించింది. ఇప్పుడు రాజకీయమే నిర్ణయిస్తుంది.

రాష్ట్రపతి, ప్రధాని పదవులను మించిన పదవొకటి తొమ్మిదేళ్ల క్రితం తన్నుకొచ్చింది. ఆ పోస్టు పేరే ‘యూపీయే ఛైర్‌ పర్సన్‌’.

లీకు మేకయింది!

లీకు! ఒక్క లీకు! ఒకే ఒక్క లీకు!

మొత్తం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్నే మార్చేసింది.

సినిమా విడుదల తేదీ: 28 జనవరి 2013( లేదా అంతకు ముందు.)

సినిమా పేరు: తెలంగాణ తేలిపోతుంది!

ఈ ముహూర్తం ఎలా నిర్ణయంచారు- అని పెద్దగా బుర్రలు బద్ధలు కొట్టుకోనవసరంలేదు. ఇది సెక్యులర్‌ ముహూర్తమే. 26 జనవరి రిపబ్లిక్‌డే. ఆరోజు శనివారం. 27 ఆదివారం. 28న పనిదినం. బహుశా రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్‌ డే కానుక ఇవ్వ బోతున్నారు.

పైన పులి-లోన చెలి

ఊపిరి లాంటిదే ఊహ కూడా.

ఊపిరితో బతికేది ఒక్క బతుకే. కానీ ఊహతో వెయ్యిన్కొక్క బతుకులు బతకొచ్చు.

‘ఓ అందాల రాకుమారుడు గుర్రమెక్కాడు.’ అని కథ మొదలు కాగానే, పాఠకుడు రాకుమారుడయి పోతాడు. కొండలు, వాగులు దాటుతుంటాడు.

‘ ఓడ మునగటంతో ఓ కుర్రవాడు వచ్చి లైఫ్‌ బోట్‌లో పడతాడు’ అనగానే ఆ విపత్తు పాఠకుడికి వచ్చి పడుతుంది.

బాబూ! ‘సైకిలు’ దిగుతారా?

అడుగులు ముందుకీ.., నడక వెనక్కీ…!

ఆశ్చర్యమే. బాధాకరమే.

కానీ, చేయగలిగిందేమీ లేదు.

తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవటానికి చేపట్టిన చంద్రబాబు పాదయాత్ర ఇలాగే వుంది. ఇది, అక్కసుతోనో, ఉక్రోశంతోనో ప్రత్యర్థులు చేస్తున్న వ్యాఖ్యకాదు.అలాగని, శత్రువర్గ మాధ్యమాలు తన మీద అకారణంగా కక్కుతున్న విషమూ కాదు.

పాదయాత్రల ఫలితాలు అలా వున్నాయి.

ఓవర్‌ టూ తెలంగాణ!

వేదికలు రెండు; ప్రదర్శనలు రెండు

కానీ దర్శకులూ మారరు. ప్రేక్షకులూ మారరు.

ఒక వేదిక సీమాంధ్ర; మరొకటి తెలంగాణ.

కొంత సేపు ఈ బొమ్మా, ఇంకొంత సేపు ఆ బొమ్మా…!!

ఈ మూడేళ్ళూ ఇదే వరస.

ఈ పూటకి సీమాంధ్ర బొమ్మే నడుస్తోంది. కానీ హఠాత్తుగా తెలంగాణ బొమ్మ తెర మీదకొచ్చింది.

‘మీ నాన్న మాజీ యా?’

మీ నాన్న మొన్న నాదెండ్ల మనోహర్‌ స్పీకరయ్యారు.

నిన్న కోట్ల సూర్యప్రకాశ రెడ్డి కేంద్రమంత్రయ్యారు

నేడు మర్రి శశిధర రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ముగ్గురి తండ్రులూ ఒకప్పడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులే.ఈ మాజీ ముఖ్యమంత్రులు కేవలం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులయి వుండాలా?

ఈ ‘రిజర్వేషన్‌’ వారి కొడుకులకేనా? కూతుళ్ళకు కూడా వర్తిస్తుందా?

ఈ రెండూ ప్రశ్నలూ వేయగానే గుర్తుకు వచ్చే పేరు- దగ్గుబాటి పురంధరేశ్వరి.

కొయ్య గుర్రానికి కొత్త రౌతులు!

మొదలయ్యింది.

.

ఆట మొదలయ్యింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆట మొదలయ్యింది.

ఈ ఆట పేరు ఇల్లు చక్కబెట్టుకోవటం.

అవును. నేడు కాంగ్రెస్‌కు దేశమంతా ఒక యెత్తు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒక్కటీ ఒక యెత్తు. లేకుంటే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరడజను రాష్ట్రాలను సైతం పెద్దగా పట్టించుకోకుండా, ఈ రాష్ట్రం మీద, ఇంతగా దృష్టి సారించదు.

ఇందుకు మొదటి సంకేతం: కేంద్రమంత్రి వర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు పెరిగిన ప్రాతినిథ్యం.

వ్యాపారం వద్దురా! రాజకీయం ముద్దురా!!

వెనకటి ఎవరో అన్నారు- దేవుడు లేక పోతే ఎలా-అని? ఉంటే సరే. లేక పోతే ఏం చెయ్యాలి? వెంటనే ఒక దేవుణ్ణి సృష్టించుకోవాలి!!

మనదేశంలో దేవుళ్ళకు లోటు లేదు. స్వరాజ్యం వచ్చాక రాజుకు లోటు వచ్చింది. వెంటనే ఎవర్నో ఒకర్ని రాజుగా చేసుకుని, అతని కుటుంబాన్ని రాజకుటుంబంగా మార్చుకోవాలి.

అలా సమయానికి దొరికిన వ్యక్తే నెహ్రూ. ఆయననుంచి మొదలయి, ఇప్పటి వరకూ నెహ్రూ-గాంధీ కుటుంబం ‘అప్రకటిత రాజకుటుంబం’ అయిపోయింది

శేఖర్ కమ్ముల ఫార్ములా: ఏకలయినా ఒకేలా! ఏకథయినా అదేలా!!

దర్శకుడన్నాక తిరగాలి. తిరగక పోతే కథలు రావు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. పాపం. కొత్తతరం దర్శకులు తిరుగుతున్నారు. ఈ తిరుగుడు రెండు రకాలుగా వుంటుంది. ఒకటి: ఇంగ్లీషు సినిమాల చుట్టూ తిరగటం . రెండు: తమ సినిమాల చుట్టూ తాము తిరగటం.

వీరిలో ఏ ఒక్కరూ జీవితం చుట్టూ తిరగరు. అదే విషాదం.

మొదటి రకం కన్నా, రెండవ రకం దర్శకులే మెరుగు. కాపీ కొడితే, తమను తామే కాపీ కొట్టుకుంటారు. వీరి మీద సానుభూతి వుంటుంది కానీ, చులకన భావం వుండదు. ఆ కోవకు చెందిన వారే శేఖర్‌ కమ్ముల.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ రాజీ ఫార్ములా: లాభసాటి ఓటమి!

తెలంగాణ!

తేల్చేస్తే తేలిపోతుంది

నాన్చేస్తే నానిపోతుంది.

తేలిపోతే, కాంగ్రెస్‌ తేలుతుందా? మునుగుతుందా? ఇప్పుడున్న స్థితిలో తేల్చకపోయినా మునుగుతుంది.

మునిగిపోవటం తప్పదన్నప్పుడు కూడా, కాంగ్రెస్‌ తేలే అవకాశం కోసం ప్రయత్నిస్తోంది. ఇది కొత్త పరిణామం. తేల్చటం వల్ల కాకుండా, నాన్చటం వల్లే ఈ ప్రయత్నం ఫలించగలదని ఆ పార్టీ నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది.

కలసి రాకే, ‘కుల’కలం!

అడుగులు తడబడినప్పుడెల్లా బడుగులు గుర్తుకొస్తారు.

తెలుగు దేశం , కాంగ్రెస్‌ పార్టీలకు నడక సాగటం లేదు. కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ అడుగు తీసి, అడుగు వేయలేక పోతోంది.

టార్చిలైట్‌ వేసి వెతికినా, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వం- అన్నది కానరావటం లేదు.అక్కడ ప్రధాని మన్‌ మోహన్‌ సింగ్‌ ‘ఉన్నారో, లేదో తెలియదు.’ ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి -‘ఉంటారో, ఊడతారో’ తెలియదు.

ప్రధాని తన ముఖానికే బొగ్గు ‘మసి’ రాసుకుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి తన ‘కేబినెట్‌’ ముఖానికి ‘వాన్‌పిక్‌’ తారు పులిమేశారు.