Tag: sc

‘అరేయ్‌’ అనేశారు గా, ఆరెస్టవుతారా మరి!?

ఎఫెక్టు ఎవరికీ పట్టదు. సైడ్‌ ఎఫెక్టులే అందరికీ కావాలి. వైద్యుడు మందిస్తాడు. ప్రాణాలు దక్కుతాయి. ఆ మందే లేకుంట,ే పోయే వాడే. కానీ అందుకు సంతోషించడు. ‘హత్తిరికే. నీ మందుకు తలనొప్పి వచ్చిందయ్యా డాక్టరూ!’ అని కయ్యానికొస్తాడు. మూడు వేల యేళ్ళు మూలన పెట్టేసిన వారి కోసం భారత రాజ్యాంగం రెండు చిన్న చిన్న మందులు…

బూటుకాలి కింద ‘బూడిద’ లేదంటారా?

తలుపు తెరిచే వుంది. ఏం లాభం? అడ్డుగా కర్టెన్‌. పేరుకే పారదర్శకత. కానీ అంతా గోప్యం. ఇదీ మన ప్రజాస్వామ్యం. అన్నీ వ్యవస్థల్నీ అనలేం కానీ, కొన్నింటిలో అయితే మామూలు తెరలు కావు, ఇనుప తెరలు వుంటాయి. అలాంటివే రక్షణ, న్యాయ వ్యవస్థలు. అవి సామాన్యమైన వ్యవస్థలా? ఒకటి దేశాన్ని కాపాడేదీ; మరొకటి వ్యక్తిని కాపాడేది.…

‘వోటు’ బ్యాంకుల్లో డిపాజిట్లు గల్లంతు!

బ్యాంకుల్ని ప్రయివేటు పరం చేసినట్లే, వోటు బ్యాంకుల్ని పార్టీల పరం చేస్తుంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క బ్యాంకులో వోట్లను డిపాజిట్టు చేసుకుంటూ వుంటుంది.

ఇందిరాగాంధీ రోజుల్లో ఎస్సీ, ఎస్టీల వోటు బ్యాంకులో కాంగ్రెస్‌కు పెద్ద యెత్తున నిల్వలు వుండేవి. అయితే రాను రాను, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పార్టీ ‘టేకోవర్‌’ చేస్తూవుంది.