(నీతులూ, విలువలూ, ప్రమాణాలు- మానవత్వం ముందు అల్పమయినవి. ఆకలిగొన్న వాడిముందూ , అవమానించబడ్డ వాడి ముందూ, గీతకారుడు కూడా చిన్నబోతాడు. భంగపడ్డ వాడి విశ్వరూపం అంత గొప్పది. మనిషినుంచి మనిషిని వేరు చేయటానికి స్మృతులూ, ధర్మాలూ అవసరం కానీ, మనిషిని పెట్టి మనిషిని గుణించటానికి ఒక్క మనసు చాలు. ఇలా అని అనుకుంటే చాలు… అలా జరిగిపోతుంది.)
అనుకోవటానికీ
అందుకోవటానికీ
అరంగుళమే దూరం
మాటకీ,
చేతకీ
అరక్షణమే దూరం
ప్రేమకీ
పెళ్ళికీ
సంతకమే దూరం
పిచ్చిది జీవితం
మనం చెప్పినట్టు వింటుంది.
-సతీష్ చందర్
(ప్రజ దినపత్రికలో ప్రచురితం)
thank you ish chandra gaaru