చీకటి వేట!

అంతా అయిపోయిందనుకుంటాం. అందరూ కుట్ర చేసి మనల్ని ముంచేసారనుకుంటాం. నమ్మకం మీద నమ్మకం పోయిందనీ, ఆశ మీదే ఆశ చచ్చిందనీ తెంపు చేసుకుని వుంటాం. ఎవరో ఊరూ, పేరు తెలీని వారొచ్చి, ఉత్తినే సాయం చేసి పోతారు. చిన్న పలకరింపు లాంటి మాట సాయమే కావచ్చు. మండువేసవిలో కరెంటులేని గదిలో ఊపిరాడనప్పుడు, కిటికీలోంచి పిల్లవాయివొచ్చి మోమును తాకి వెళ్ళినట్టుంటుంది కదూ..! అప్పుడు మళ్ళీ జన్మలోనే మరో జన్మ యెత్తినట్లుంటుంది

photo by kishen chandar


చీకటిని
ఎప్పుడయినా వేటాడారా?
కనీసం
రాత్రిపూట
దీపాలన్నీ ఆరిపోయినప్పుడయినా
చీకటిని
బెదరించారా?
ఈ సారి
చిన్నగా నవ్విచూడండి
చీకటి వణికిన
దృశ్యాన్ని మీరు చూడగలరు.
మిణుగురు పురుగు కూడా
ఇలాగా అంధకారాన్ని
ఎదిరిస్తుంది.
-సతీష్‌ చందర్‌
(ప్రజ దినపత్రికలో ప్రచురితం)

1 comment for “చీకటి వేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *