‘దేహ’ భక్తులు

‘గురూజీ?’

‘వాట్‌ శిష్యా!’

‘బాబా రామ్‌ దేవ్‌కీ, స్వామీ నిత్యానందకీ తేడా ఏమిటి గురూజీ?’

‘ఇద్దరు చూపే మోక్షం ఒక్కటే. మార్గాలు వేరు శిష్యా!’

‘అంత డొంక తిరుగుడు ఎందుకు గురూజీ? ఒకరు యోగా బాబా, ఇంకొకరు భోగా బాబా- అని చెప్పొచ్చు కదా?’

‘తప్పు. శిష్యా ఇద్దరూ కట్టేది కాషాయమే!’

cartoon:balaram

‘పోనీ ఒకరు రాజకీయ బాబా, ఇంకొకరు సినిమా బాబా అనవచ్చా గురూజీ?’

‘ఎందుకలా అంటున్నావ్‌ శిష్యా?’

‘అశాశ్వతమైన తమ తమ దేహాల్ని ఒకరు దేశ రాజకీయాలకీ, మరొక దేశీయ చిత్ర కళాకారులకూ అంకితం చేశారు కదా గురూజీ?’

‘అంటే వారిద్దరూ దేశభక్తులంటావా శిష్యా?’

‘దేహ-భక్తులంటాను. కాదంటారా గురూజీ?’

‘నాకు తెలీదు శిష్యా!’

– సతీష్‌ చందర్‌

Leave a Reply