బువ్వ దొంగలు

దు:ఖిస్తే ఏడుపే రావాలనీ, ఆనందిస్తే నవ్వే రావాలనీ సూత్రీకరణలు చెయ్యటం అన్నివేళలా నడవదు. సుఖపెట్టే రాత్రులూ, కష్ట పెట్టే పగళ్లూ వున్నట్లే, క్షేమం కోరే శత్రువులూ, అణచివేసే మిత్రులూ వుండే ప్రపంచంలో, ఏ జీవితమూ ఒక మూసలో ఇమడదు. గుండెలు తెరవాలే కానీ, ఒక్కొక్క అనుభవమూ ఒక మహా కావ్యం. అలాంటి ఏ గుండెలు ఏమి మాట్లాడుకున్నా, దోసిలి పట్టి కవిత్వం చేయాలనిపిస్తుంది.

తల్లీ బిడ్డలు (photo by LadyMohan)

‘పుట్టు దరిద్రుడవు
నీకు బువ్వెందుకురా..!’
అమ్మ బుజ్జగింపు.

‘నా బువ్వను
నేను పుట్టక ముందే
తిన్నారెవ్వరో..’
పసివాడి ఫిర్యాదు.

పకపకలు
బువ్వతో నిండాల్సిన కడుపుల్ని
నవ్వుతో నింపుకున్నారు.
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం)

6 comments for “బువ్వ దొంగలు

  1. పకపకలు
    బువ్వతో నిండాల్సిన కడుపుల్ని
    నవ్వుతో నింపుకున్నారు.

    వారికి అదన్నా దక్కింది..సగటు మధ్య తరగతి వాడికి అది కూడా లేదు కదా!

  2. దొంగలకి కూడా సింహాసనం పై కూర్చోబెట్టి మరీ బోలెడంత సోషల్ స్టేటస్ ఇస్తాం మనం ఎంచక్కా వోట్లేసి! ఆ పసివాడి ఫిర్యాదు ఓ శాపంలా లేదూ….

Leave a Reply