మనిషిలో మనిషి

నాలో నన్నూ, నీలో నిన్నూ, మనలో మనల్నీ వెతుక్కుంటూనే వుంటాం. ఒకరికి ఒకరు దొరుకుతాం కానీ, ఎవరికి వారు దొరకం. కానీ అప్పుడప్పుడూ దొరికి జారిపోతుంటాం. అలా దొరికినవి కొన్ని క్షణాలే కావచ్చు. అప్పుడు కల కూడా కవిత్వంలాగా వుంటుంది. జీవితం ప్రియురాలంత ఇష్టంగా వుంటుంది. పసిపిల్లంత ముద్దుగా వుంటుంది. నేను పుట్టిపెరిగిన ఇల్లంత గొప్పగా వుంటుంది. అందుకే నాలోకి నన్ను నెట్టేవాళ్ళ కోసం నిత్యం ఎదురు చూస్తూనే వుంటాను.

Photo By dbarronoss

ఎండలో
దీపం వెలిగించినట్లు-
చెట్ల పైన
చలువ పందిరి వేసినట్లు-
నీటి మీదనే
నీటికై వెతుకులాట-
మనుషుల్లో
మానవత్వాన్ని గాలించినట్లు.

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

5 comments for “మనిషిలో మనిషి

  1. మనిషి తననలో తనను వెతుక్కోవడం, దొరకబుచ్చుకోవటం, గొప్ప అనుభూతి. చక్కటి భావం.

Leave a Reply