మానవేతరులు

padapic21-3-13నిజమే. తీయాలనే వుంది. ఉరి తీయాలనే వుంది. దేహాలను దురాక్రమంచే కిరాతకాన్ని ఉరితీయాలనే వుంది. అమ్మదగ్గర తాగిన పాలు అమ్మాయిదగ్గర కొచ్చేసరికి విషం గా మారిపోతున్నాయి. ఇందుకు కారణమైన  ‘అజీర్ణ‘ క్రిమిని పట్టుకుని పీక నులిమేయాలని వుంది. కానీ ఈ క్రిముల పెంపకాన్ని పరిశ్రమగా పెట్టారని తెలిసింది. వారెవ్వరూ తేలేవరకూ ఉరి ప్రశ్నార్థకంగా వేలాడుతూనే వుండాలా? అందాకా ఈ క్రిమిసోకిన వాడి రోగలక్షణాలని జనానికి చెబుదాం. ఈ రోగలక్షణాలున్న మానవేతరులను మచ్చుకి కొందరిని పరిచయం చేస్తాను.

 

 

అప్పుడే పూసిన

పువ్వును అలాగే

చూస్తూ వుండి పోవాలని పిస్తుంది.

చూసే కొద్దీ మనసు కూడా

వువ్వంత మెత్తనవుతుంది.

పసిపిల్ల బోసి నవ్వు కూడా అంతే.

కానీ కొందరేమిటో

అమాంతం

పువ్వును నలిపేయ్యాలనీ,

నవ్వును చిదిమెయ్యాలనీ

దూకేస్తారు.

వాళ్ళను మానవ జాతికి

దూరంగా వుంచటం మంచిది.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 23-29 మార్చి 2013 లో ప్రచురితం)

Leave a Reply