మొలచిన కల

(ఏడ్చి ఏడ్చి ఊరుకున్న కళ్ళల్లోకి చూడండి. ఒక మెరుపు. ఒక ఆశ. ఒక ఇంధ్రధనువు. మాటా, మాటా అనుకున్న ప్రతీసారీ, ఈ అనుబంధం ఇలా ముగిసిపోతుందనే అనుకుంటాం. కానీ, మరుసటి రోజు ఇద్దరి కరస్పర్శతో ఓ కొత్త ఉదయం! అంత పెద్ద చెట్టు కూలి పోయిందనే భావిస్తాం. కానీ కాస్సేపు విత్తనం లో దాక్కొని విరాట పర్వానికి తీస్తుంది. చినుకు పడగానే విచ్చుకొని మెల్ల మెల్లగా విశ్వరూపం ధరిస్తుంది.)

జిరాఫీ ( photo by flowernok)

ఏ చిటారు చిగురును
చూసిందో…
జిరాఫీ మెడ
అంతలా సాగింది!

కల కనాలే కానీ..,
తీర్చేందుకు
మన దేహమే
మనముందు
ప్రణమిల్లుతుంది.

-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దిన పత్రికలో ప్రచురితం)

1 comment for “మొలచిన కల

  1. molichina kala jagatanta vistarinchaugaka…neenu eerujuto padava sari raktadhanam cheshanu..friends naa raktam swikarinchina vyakti kolukovalani praddinchandi.

Leave a Reply