వంటా? మంటా?

రేణుకా చౌదరి (caricature courtesy :sudheer)

‘గురూజీ?’
‘వాట్ శిష్యా!’

‘తెలంగాణ సమస్యను రేణుకా చౌదరి వంటతో పోల్చారేమిటి గురూజీ?’
‘అవును. ప్రెషర్ కుక్కర్ మీద వంటతో పోల్చారు.ఎన్ని ఈలలు వేస్తే వంటపూర్తవుతుందో చెప్పవఃచ్చుకానీ, తెలంగాణ పరిష్కారం చెప్పలేం అన్నారు శిష్యా!’

‘అయితే, నేను తెలంగాణ ఉద్యమాన్ని మంటతో పోల్చవచ్చా గురూజీ?’
‘అది కుదరదు శిష్యా!’

‘ ఎందుకు కుదరదు గురూజీ, కింద మంట పెడితేనే కదా, కుక్కర్ విజిల్ వేసేదీ..? సెగ తగిలితేనే కదా, వంట పూర్తయ్యేదీ…?’
‘నాకు తెలియదు శిష్యా..!?’-
– సతీష్ చందర్

1 comment for “వంటా? మంటా?

Leave a Reply