సముద్రం

photo by noideas


వెళ్ళీ వెళ్ళగానే

నా వస్త్రాల్ని వలిచింది

పసివాణ్ణయ్యాను

నిండా ముంచింది

వృధ్ధుణ్ణయ్యాను

ఒక జీవితం ముగిసిందని

వెనుదిరగబోయాను

అందమయిన అలవొకటి

అరికాళ్ళను ముద్దాడింది

ఇప్పుడు నాకు యవ్వనం

(సతీష్ చందర్ ‘ఆదిపర్వం’ కావ్యం నుంచి)

2 comments for “సముద్రం

Leave a Reply