‘స్వవిశ్వాస’ తీర్మానం!

‘గురూజీ?’
‘వాట్‌ శిష్యా!’

‘మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో ఎవరు గెలిచినట్లు గురూజీ?’
‘అవిశ్వాస తీర్మానంలోనా? ఇంకెవరూ? కిరణ్‌ సర్కారే…’

‘లేదు. జగన్‌, చంద్రబాబులు కుడా గెలిచారు గురూజీ!’
‘అదెలా శిష్యా?’

కార్టూన్: బలరాం


‘జగన్‌ సభ్యులు జగన్‌ చెప్పినట్లే వోటేశారు కనుక జగనూ, జగన్‌ సభ్యుల మీద అనర్హత వేటు వేయిస్తున్నాడు కనుక చంద్రబాబూ గెలిచారు. అవునా గురూజీ?’
‘అలాగా? అయితే ఎవరు వోడినట్లు శిష్యా..?’

‘మీరూ, నేనూ.., అనగా వోటర్లుగా మనమే గురూజీ?’
‘అయితే ఇది అవిశ్వాస తీర్మానం ఎలా అవుతుంది గురూజీ?’

‘ఎవరి మీద వారికి విశ్వాసం పెంచింది కాబట్టి, దీనిని ‘స్వవిశ్వాస’ తీర్మానమని పిలవొచ్చేమో గురూజీ?’
‘నాకు తెలీదు శిష్యా..!?’
– సతీష్‌ చందర్‌

Leave a Reply