పేద వాళ్ళకిచ్చిన పిలుపుల్ని ఒక్కొక్క సారి సంపన్నులు స్వీకరించేస్తారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ- అన్నది కుచేలుర కోసం పెట్టింది. దానిని కుబేరులు పాటించేశారు. వెయ్యి కోట్ల ఆస్తి వున్నవాడికి ఒక్కడే కొడుకనుకోండి. వెయ్యి కోట్లూ వాడికే వెళ్ళిపోతాయి. పది మంది పిల్లలుంటే, ఒక్కొక్కడూ వందకోట్లకు పడి పోతాడు. అందుకని సంపన్నుల్లో ఎక్కువమందికి పరిమిత కుటుంబాలే వున్నాయి. అలాగే ‘కులాంతర వివాహాల్ని’ ప్రోత్సహించాలని రాజ్యాంగ కర్తలు ఎంతగానో తపన పడ్డారు. దీనికి సామాన్యులు కాకుండా అసమాన్యులూ, సంపన్నులూ, ప్రసిధ్ధులూ పాటించేస్తున్నారు. ఈ మధ్య రహస్యంగా ఎన్టీఆర్ మనవడు తారక రత్న, అలేఖ్య రెడ్డిని చేసుకున్నాడు. ఆ మధ్య చిరంజీవి తనయుడు రామ్ చరణ్, అపోలో హాస్పటల్స్ ఛైర్మన్ ప్రతాప రెడ్డి మనుమరాలు ఉపాసనను పెళ్ళాడాడు. అంతకు ముందు మోహన్ బాబు కొడుకు విష్ణు, వెరోనికా రెడ్డిని పరిణయమాడాడు. రాజకీయంగానూ, పారిశ్రామికంగానూ అగ్రభాగాన వున్న వారే ఈ ‘ఆదర్శాన్ని’ పాటిస్తున్నారు. కానీ మధ్యతరగతి వారు సరసమైన కట్నానికి సాటి కులస్తుడు దొరికే వరకూ ఎదురు చూస్తున్నాడు. ‘ఆదర్శం’ కూడా ఖరీదయినదే. అది సంపన్నులకే అందుబాటులో వుంటోంది.
Dear Sir! U have a separate angle of social thinking, good contribution regarding Intra(upper)caste marriages. they are also catching boys from SC ST OBC who got placed at Civils viz Group-I,II, n Civil toppers like IAS, IPS, etc…
జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు వేసిన అందమే .డబ్బు ఉన్నవాడు ఏమి చేసిన వార్తనే…పేదవాడు చేస్తే ” పరువు ” . ఇది నేటి సమాజం
సేలేబ్రేటిల కులాంతర వివాహాలు వెనుకా ………
ఏ నిర్ణయం వెనుక, ఏ వర్గ అవసరులున్నాయో , దానితో ముడిపడివున్న ఆర్ధిక కారణాలేమిటో
క్షుణ్ణంగా పరిసిలించిన తరువాతనే ఓకే అవగాహనకు రమ్మనమని కారల్ మార్క్స్ మహోపాధ్యాయుడు
ప్రభోదించారు. ఇటివల ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్న సేలబ్రేటిలు,రాజకీయనాయకులు, వారి పిల్లల
కులాంతర వివాహాలను ఇదేకోణంలో విశ్లేచించాల్సి వున్నది. కాంగ్రెస్ నాయకుడు, మెగాస్టార్ చిరంజీవి
కుమారుడు రామ్చరణ్ తేజ్, చిరంజీవి మేనల్లుడు, అల్లు అరవింద్ కుమార్డు బన్నీ, కలక్షన్ కింగ్ మోహన్
బాబు కుమార్డు విష్ణు లాంటి వారి వివాహాలు రెడ్డి కులస్తులతో ‘కులాంతర వివాహాలు’ జరిగాయి. ఇదేదో
కులనిర్మూలనకు కులాంతర వివాహాలు అవసరమన్న అంబేద్కర్, మహాత్మా గాంధీ ల పిలుపుకు
ప్రతిస్పందనగా ఇప్పుడు జరిగిన అదర్స వివాహలుగా ఇటివల ఒక వర్గం మీడియా లో గొప్పగా ప్రచారం
జరుగుతున్నది….అయితే ఇవన్ని మొదట్లో ప్రేమవివాహలు గా ప్రచారం పొందాయి. ఇక్కడ వదువులందరూ
రెడ్డి సామజిక వర్గానికి చెందినా కుబేర్లు, రాజకీయ, ఆర్ధిక, పారిశ్రామికంగా అగ్రస్థాయిలో నిలిచిన వారిపిల్లలే..
అన్ని రంగాల్లోనూ ఇరుకుటుంబాలు సమవుజ్జిలే, సామాజికంగా చూస్తే కాపు, కమ్మ, రెడ్డి అనేవి ఒకే సంప్రదాయం,
సంస్కృతి కలిగి వ్యవసాయమే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవిస్తున్న కులాలే….అగ్ర వర్ణాలుగా గుర్తింపు పొందినవే…
కనుక ఇవి పేరుకే కులాంతర వివాహాలు…..ఇందులో ఎవరు కుడా వెనుకబడిన వర్గాలో,,,,,దళితులో కాదు. ఇక్కడ
ఒక విషయం గమనించాలి….సేలేబ్రేటిలు ఎప్పుడు ఆర్ధిక పరిస్తితి కే అదిక ప్రాదాన్యం ఇస్తారు. అకోణం లోనే వీళ్ళు
నిర్ణయాలు తీసుకుంటారు..చిరంజీవి ఇద్దరు కుమార్తెలు వారికంటే ఆర్ధికంగా చాల తక్కువ స్థాయిలో వున్న వారిని
ప్రేమిస్తే చిరంజీవి కానీ అరవింద్ కానీ అంగికరించ లేదన్న విషయం జగద్విదితమే………..అంతే కాదు మొహనబాబు కుమార్తె
లక్ష్మి- వుయ్యూరు కు చెందిన యువకుల ప్రేమ కద ముగియడానికి కారణాలు వెనుక ‘ఆర్ధిక’ స్తోమత ప్రధాన పాత్ర
పోషించింది. సమజంలో ఇటివలకాలం లో ప్రేమకారణంగా కులాంతర వివాహాలు జరుతున్నాయి. అగ్రవర్ణాలు, నిమ్న వర్గాల
మధ్య విపరితగా జరుగుతున్నాయి. ఆర్దికంగాతమ కాళ్ళ పై తాము స్థిరపడిన ప్రేమికులు పెద్దలను దిక్కరించి ధైర్యంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.
వ్యామోహం తీరిన తరువాత కూడా వారు కలిసే వుంటే పెద్దలు వారిని ఆహ్వానిస్తున్నారు. లేకుంటే చాల మంది విషయంలో అవి
వికటిస్తున్నాయి……కులాంతర వివాహాలు మధ్యతరగతిలో కూడా ఇటివల ఇరుకుటుంబాల కుదుర్చుకున్న రీతిలోనే జరుగుతున్నాయి.
ఇది హర్షించదగ్గ పరిణామము. అంతేగాని సేలేబ్రేటిల పెళ్ళిళ్ళను నమ్మి సంతోష పడిపోకండి……