అడుగు జాడ!

మబ్బుకీ మబ్బుకీ మధ్య ఎండలా, ఏడుపుకీ ఏడుపుకీ మధ్య నవ్వులా, విశ్రాంతికీ విశ్రాంతికీ మధ్య పనిలా ఏమిటో ఈ కవిత్వం? గాఢాలింగనంలో కూడా ఇంకా ఏదో దూరం మిగిలిపోయినట్లూ, ఎంతో గొప్పగా నడిచిపోతున్న జీవితంలో కూడా ఏదో వెలితి. ఏ ఫర్వాలేదు.. ఎక్కడ జాగా వుంటే అక్కడ బతకటానికి కాసింత అమాయకత్వం అవసరమయిందన్న మాట. నిజం చెప్పొద్దూ..? కవిత్వమూ, అమాయకత్వమూ రెండూ ఒక్కటే…!

Photo : Kishen Chandar

నడకే కదా
అడుగు తీసి
అడుగు వెయ్యటమే కదా
అనుకుంటాం కానీ,
తొలి అడుగు వేసి చూస్తే
తెలుస్తుంది-
అది ఎంత నరకమో.
అందుకే
నిప్పుల గుండమయినా
చంద్రమండలమయినా
తొలి అడుగు వేసిన వాడే
చరిత్ర సృష్టిస్తాడు.
-సర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *