‘గురూజీ?’
‘వాట్ శిష్యా!’
‘రూపాయి పడింది. చూశారా?’
‘ఎక్కడ శిష్యా!?’
‘ఇక్కడే ఎక్కడో పడింది గురూజీ?’
‘అలా ఎలా పడేసుకున్నావ్ శిష్యా!?’
‘అదే అర్థం కావటం లేదు గురూజీ?’
‘చిల్లు వుందేమో, నీ జేబుకు..!?’
‘చిల్లు వున్న మాట వాస్తవమే. కానీ నా జేబుకి కాదు… మన్‌మోహన్ సింగ్ జేబుకి’
‘…………………………!?’
రాత: సతీష్ చందర్
గీత : బలరాం