నిన్న
విరగ కాచిన చెట్టే.
నేడు వుత్త ఆకులతో
గాలి మాత్రం వీస్తోంది.
ఎవరో వృధ్ధుడు
తనలో తాను గొణిగినట్లు.
శ్రోతలులేని మహావక్తలాగే
ఫలాలు లేని మహావృక్షం
పలుకరించే వారు లేక!
-సతీష్ చందర్
(‘ప్రజ’దినపత్రికలో ప్రచురితం)
-సతీష్ చందర్
(‘ప్రజ’దినపత్రికలో ప్రచురితం)
You must be logged in to post a comment.
very good minipoems …
Very Nice Sir
నేటి ఆర్ధిక పోకడల ప్రభావం వల్ల
మోసపోయిన,అమాయక మనసుల స్వార్దపు ఆలోచనల మధ్య
నిస్వార్ధంతో జీవితాలను ప్రజలతో గడిపి,
నిరాశను జయించి,
ఒంటరిగా నైనా ధైర్యంగా నిలబడ్డ
ప్రతి మనసుకూ..
తోడుగా
నేను సైతం మీ కవిత పక్కన
నా మాటలతో నిలుస్తూ…
nice sir …..