యుగ స్పృహ

నా భూమి నాది కాదన్నారు
విప్లవ వాదినయ్యాను

నా దేహం నాది కాదన్నారు
స్త్రీవాదినయ్యాను

నా ఊరు నాది కాదన్నారు
దళిత వాదినయ్యాను

నా దేశం నాది కాదన్నారు
మైనారిటీ వాదినయ్యాను

నా ప్రాంతం నాది కాదన్నారు
ప్రత్యేక వాదినయ్యాను

కడకు
నేను మనిషినే కాదన్నారు
దూరంగా జరగండి
మానవబాంబు నయ్యాను

రచనా కాలం:2005
(సతీష్ చందర్ కవితా సంకలనం ‘ఆదిపర్వం’ లోని కవిత ఇది. ఈ గ్రంథం 2008 వ సంవత్సరంలో ముద్రితమయినది. పుస్తకం కావలసినవారు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించగలరు. వెల: రు.60 లు)

2 comments for “యుగ స్పృహ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *