ఇంట్రో
(అటూ, ఇటూ, ఎటో చూస్తూ వుంటూంటాం. కన్ను దేని మీదయినా పడవచ్చు. అది గడ్డిపరక కావచ్చు. గగనమూ కావచ్చు. మనల్ని అందులో చూసుకుంటాం. కాదు..
కాదు.. దానిని మనలా మార్చుకుంటాం. అందుకోసం ఉత్తినే నోటికొచ్చిన నాలుగు మాటల్ని వాడుకుంటాం. పాపం! పిచ్చి మాటలు! వాటికి తెలియకుండా అవి కవిత్వమయి కూర్చుంటాయి.)
భూగోళమే కాదు-
మనిషి కూడా
మూడొంతుల నీరే!
బతికినంత కాలం-
ఒక వంతే నవ్వు
మిగిలినదంతా
కన్నీరే!
– సతీష్ చందర్
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)
ఇండియా టుడే వారి ” వార్షిక సాహిత్య సంచిక ” లో మొదటిసారి మీ కధానిక “డాగ్ ఫాదర్” చదివాను. అంతకు ముందు నాకు దొరికిన దగ్గరల్లా కధలు చదవటం నాకు అలవాటే కాని ఆ కధల్లోని పాత్రలు కధా వస్తువు దాదాపు నాకు పరిచయం లేనివిగా అనిపించేవి కాని మీ కధ చదివినప్పుడు కధలోని సంభాషణలు… పాత్రలు… ఆశ్చర్యం ! ఆ కధ అచ్చం నాదో నాతోటి సావాసగాళ్ళ కధలానో అనిపించింది . అది మొదలు అట్లాంటి వార్షిక సంచికలు మొదలు తెలుగు దిన పత్రికల్లోని ఆదివారం అనుబంధాల వరకు మీ రచన కధ గాని కధానిక గాని దొరికితే వదలకుండా చదివే వాడిని… చదవాలని చాలా ఆశ పడేవాడిని.
ఈ మధ్యనే మీ మరొక కధానిక చాలా సంతోషపెట్టింది అది ” దేశమంటే మెతుకులోయ్ ” . మీ మార్కు రచన అది మీరు దళిత వాడల్లోకి ఎవరినో తీసుకుపోతారు … దళిత వాడను వారి జీవన సరళిని సరిక్రొత్త రీతిలో ఆవిష్కరిస్తారు , మీ కధల్లోని దళితుల జీవన శైలిని వారు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ సమస్యలను మించి హైలైట్ చేసి మీ కధలను నడిపిస్తారు .
అటువంటి మీతో డైరెక్టుగ ఇంటరాక్ట్ అవ్వడం నిజంగా అదృష్టమే సార్ . యిహ యిక్కడ మీ కవిత ఒక సైంటిఫిక్ రీజన్ ను కూడా కవితలాగ ఆర్ద్రంగా చెప్పడం చాలా నచ్చింది.
great expression sir!