‘హౌస్‌’ కన్నా జైలు పదిలం!

”గురూజీ?’

‘వాట్‌ శిష్యా!’

‘ప్రజాస్వామ్యానికి అసెంబ్లీ, సెక్రెటేరియట్‌- ఈ రెండూ అవసరం అంటారా?’

‘అదేమిటి శిష్యా? అంత మాట అనేశావ్‌?’

‘అసెంబ్లీ ఎందుకు చెప్పండి?అరుచుకోవటానికి కాకపోతే..! ఎమ్మెల్యేలు ఆ ఆరుపులేవో టీవీ స్టుడియోల్లో ఆరచుకోవచ్చు కదా?’

‘మరి చట్టాలు ఎక్కడ చేస్తారు శిష్యా?’

‘ఉన్న చట్టాలు చాల్లెండి.’

‘చట్టాలు అమలు చెయ్యటానికి మంత్రులూ అధికారులూ వున్న సచివాలయం కావాలి కదా?’

‘వాటిని అమలు చేస్తే, అందులో వున్నవారినే ఎంత మందిని లోపల వెయ్యాల్సి వస్తుందో..?’

‘మరీ అసెంబ్లీ, సెక్రటేరియట్‌ పని ఎవరు చేస్తారు శిష్యా?’

‘చట్టాలు జైల్లో చెయవచ్చు. ముఖ్యనేతలు అక్కడే దొరుకుతరు. వాటి అమలు అంటారా? అంటే లోపల వెయ్యటమే కదా? అందుకు సిబిఐ సరిపోతుంది. కాదంటారా గురూజీ?’

‘నాకు తెలీదు శిష్యా!’

రాత : సతీష్ చందర్
గీత : బలరాం

Leave a Reply