Month: July 2013

‘కూల్చేదీ మేమే! కట్టేదీ మేమే!’

‘తెచ్చేదీ మేమే, ఇచ్చేదీ మేమే’

‘చిచ్చుపెట్టేదీ మేమే. చల్లార్చేదీ మేమే.’

‘ప్రశ్నవేసేదీ మేమే. బదులిచ్చేదీ మేమే’

‘ఆందోళనలు చేసేదీ మేమే. అరెస్టులు చేసేదీ మేమే’

‘జాప్యం చేసేదీ మేమే, బలిదానం అయ్యేదీ మేమే’

‘ప్రతిపక్షమూ మేమే, పాలక పక్షమూ మేమే’

వి.’కుప్పిగంతు’ల్రావు!

పేరు : వి.హనుమంత రావు

ముద్దు పేరు : వీహెచ్‌, హన్మన్న, వి.’కుప్పిగంతు ‘ ల్రావు (శత్రువు ఎదురయితే వయసను సైతం మరచి ‘కుప్పించి’ గెంత గలను.)

విద్యార్హతలు : సంస్కృతంలో ప్రావీణ్యం( డెహరాడూన్‌ ఎయిర్‌ పోర్ట్‌ వద్ద నేనూ, తెలుగుదేశం నేత రమేష్‌ రాథోడ్‌ మాట్లాడుకున్నది సంస్కృతంలోనే. గమనించలేదా..?) దీనిని ‘బూతు’ క్యాప్చరింగ్‌ అని కూడా అంటారు. (బూతుల్ని స్వాధీనంలోకి తీసుకోవచ్చన్నమాట.) పూర్వం పోలింగ్‌ బూతుల్లోకి చొరబడటాన్ని ఇలా పిలిచేవారు.

అడిగింది స్టేటు! చీల్చేది వోటు!!

అడిగినది ఇస్తే సహాయం. అడగినిది ఇస్తే రాజకీయం

రాష్ట్రం విషయానికి వస్తే, ఇక్కడి నుంచి వచ్చిన కోరికలు రెండు. సీమాంధ్రనుంచి ‘సమైక్యాంధ్ర’ అడిగారు. తెలంగాణ నుంచి ‘ప్రత్యేక తెలంగాణ’ అడిగారు. ఈ రెండింటిలో ఏది ఇచ్చినా ఎవరో ఒకరికి సహాయం చేశారు- అనుకోవటానికి వీలుండేది. కానీ ఆ రెండూ కాకుండా ‘రాయల తెలంగాణ’ అనేది ఇస్తామంటున్నారు.