Author: mschandar

రాజకీయాల్లో ‘కులం’ బద్దలు గొట్టిన జేసీ!

కుటుంబాన్ని సాగదీస్తే కులమవుతుందనీ, కులాన్ని ఎత్తి కుదేస్తే కుటుంబమవుతుందనీ.. చెప్పటానికి ఏ సామాజిక శాస్త్రవేత్తో దిగిరానవసరంలేదు. తేట ‘తెలుగు’ పార్లమెంటు సభ్యుడు చాలు. నిన్నగాక మొన్న ఈ మ్కునే జేసీ దివాకరరెడ్డి ‘కులం’ (కుండ కాదు) బద్దలు గొట్టి మరీ చెప్పారు. తిన్న ఇంటి వాసాలు కాదు, ఉన్న పార్టీ దోషాలను లెక్కించటంలో ఆయనకు ఆయనే…

‘పొత్తేష్‌’ కుమార్‌!

నా పేరు : నితిష్‌ కుమార్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: మధ్యలో ఎన్నిసార్లు మానుకున్నా మళ్ళీ అదే ఉద్యోగం:బీహార్‌ ముఖ్యమంత్రి. ఒకప్పుడు ప్రధాని మంత్రికి దరఖాస్తు చెయ్యాలనుకున్నాను. ‘గుజరాత్‌ సీఎంగా వున్న మోడీ పీఎం కాగలిగినప్పుడు, నేనెందుకు కాకూడదు?’ అని అనుకున్నాను. అది మోడీ మనసులో పెట్టుకుంటే, నేను సీఎం కావటం కూడా కష్టమే..అది వేరే…

కుటుంబాలే ముందు.. పార్టీలు తర్వాత…!

కుటుంబం ఒక్కటే, పార్టీలు వేరు. ఇలా అంటే ఒకప్పుడు నమ్మేవారు. కానీ ఇప్పుడు నమ్మడం మానేశారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలే పార్టీలయిపోయాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిందంటున్నారు కానీ, అది రాజకీయాల్లో బతికి వుంది. ప్రాంతీయ పార్టీలొచ్చాక, వాటి సారథ్యాన్ని కుటుంబాలే చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్‌ కుటుంబం, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ కుటుంబం, మహరాష్ట్రలో…

ప్రణబ్ ను పిలిచి తిట్టించుకున్నారా..?

కాంగ్రెస్‌ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేడు వైరిపక్షాలు. ఎప్పుడూ కలసి లేవు. రెంటి వయసూ ఒకటి కూడా కాదు. స్వరాజ్యానికి ముందు నుంచే కాదు, అసలు స్వరాజ్యమే తాను తెచ్చానని భావించే పార్టీ కాంగ్రెస్‌. కానీ బీజేపీ అన్నది ఎమర్జన్సీ తర్వాత ఏర్పడ్డ జనతాపార్టీ ప్రభుత్వ ప్రయోగం విఫలమయిన తర్వాత మొక్కతొడిగిన పార్టీ బీజేపీ.…

సమరంలో హీరో! ‘ఉప’సమరంలో జీరో!

బీజేపీ పెరుగుతోందా? తరుగుతోందా? పెరిగి తరుగుతోందా? ఈ పార్టీకి ‘సమరం’ అనుకూలించినట్లుగా, ‘ఉప సమరం’ అనుకూలించటంలేదు. ఎన్నికల్లో రెపరపలాడే కాషాయ పతాక, ఉప ఎన్నికల్లో మాత్రం తలవాల్చేస్తోంది. ఇది ఇప్పటి విషయం కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, వెంటనే మొదలయిన ఉపఎన్నికల నుంచీ, ఇదే వరస. అవి పార్లమెంటు స్థానాలకు చెందిన ఉప…

చక్రాల కుర్చీ కాదు…చలన సింహాసనం!

మానవుడే మహనీయుడు కాదు, మహనీయుడే మానవుడు. కాలు తీసి కాలు కదపలేడు. వేలయినా కదపగలడో లేదో తెలీదు. కానీ తాను విహరించే ‘గగనాంతర రోదసి’లో. తన కూర్చున్న చోట ఒక్కటే కుటుంబం. అది తను చుట్టూ భ్రమిస్తుంది. కానీ తాను అనునిత్యమూ పరిభ్రమించేది అనేకానేక సౌరకుటుంబాలతో. యవ్వన తొలిపాదంలో తన మరణ వార్త తానే విన్నాడు.…

శ్రీదేవి: మూడక్షరాలు కాదు; మూడు తరాల పేరు!

ఒక దిగ్భ్రాంతి; ఒక ఉత్కంఠ; ఒక విషాదం- వెరసి నటి శ్రీదేవి మరణ వార్త. కూర్చున్న చోటనుంచి ఒకరు చివాల్న లేచి వెళ్ళిపోతారు. ఖాళీ. వెళ్ళింది ఒక్కరే. కానీ లక్షమంది వెళ్ళితే ఏర్పడ్డ వెలితిలాగా వుంటుంది. ఏ రంగంలో అయినా అంతే. కళారంగంలో అయితీ మరీను. చార్లీ చాప్లిన్‌ ఇలాగే చటుక్కున వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద…

‘మెగా’శాంతి!

పేరు : విజయ శాంతి దరఖాస్తు చేయు ఉద్యోగం: రాములమ్మ-2 ( ఏం ‘బాహుబలి-2 సినిమా వస్తే చూడలేదా? తెలుగు తెర మీద వున్న ఏకైక ‘లేడీ హీరో’ని ‘సీక్వెల్‌’ రాజకీయాల్లో ఇస్తున్నా. చూడలేరా..?) వయసు : ‘ఫైట్స్‌’ చేసే వయసే. వృధ్ద హీరోలు ఎడమ చేత్తో లారీలనూ, ట్రాక్టర్లను ఎత్తేసినప్పుడు ఈ సందేహం రాదు.…

‘రుణ్‌’ జైట్లీ!

పేరు : అరుణ్‌ జైట్లీ దరఖాస్తు చేయు ఉద్యోగం: లోక్‌ సభ సభ్యుడు (2014లో పోటీ చేసి ఓడిపోయాను కదా? అయినా కేంద్ర మంత్రిని కాగలిగాను. ప్రజల వోట్లతో పనిలేకుండా రాజ్యసభకు వెళ్ళగలిగాను. దేశ ఆర్థిక గతిని మార్చేశాను. మీ జేబుల్లో నోట్ల రంగు మార్చగలిగాను. అయినా లోక్‌ సభ కు గెలిచానన్న తృప్తి నాకు…

మాటలో పాగా!

ఒక్కడే. మాట్లాడతాడు. తనలో తాను కాదు. తన ముందున్న వారితో. తనకు దూరంగా వున్నవారితో. వందలు, వేలు, లక్షలు, కోట్ల మందితో! అప్పుడు మాట మంత్రం కాదు. మాధ్యమం. మాధ్యమం మారణాయుధమూ కాగలదు. మృత సంజీవినీ కాగలదు. అక్షరం చేసి ముద్రించినా, శబ్దం చేసి వినిపించినా, దృశ్యం చేసి చూపించినా, లేక ముద్రిత శబ్దచలనచిత్రంగా మార్చి…

నాడు పాటను మెచ్చి.. నేడు పద్యానికి మొక్కి.!

అలకలు కొన్ని; కినుకలు కొన్ని; భజనలు కొన్ని..వెరసి ప్రపంచ తెలుగు మహాసభలయ్యాయి. ఈ ఏడాది(2017) చివర్లో మొత్తానికి హైదరాబాద్‌ మోతెక్కిపోయింది. కోట్ల వ్యయం; లక్షల జనం; వేల కవులూ, రచయితలూ, భాషాభిమానులూ. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి(తెలుగువాడు కావటం యాదృచ్ఛికం.) శ్రీకారం చుడితే, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(తెలుసుకున్న తెలుగు చరితతో) ‘శుభం’ కార్డు వేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు:…

Kovind Plays with 3 ‘B’S

Hyderabad can be defined in 3 ‘B’s: Biryani, Badminton and Bahubali. This was the First comment from the First Citizen of the country for the First official official visit to the City. Yes. Ramnath Kovind, the President of India didn’t…

ముద్దుల తనయుడికి ‘ముళ్ళ’ వారసత్వమా..!?

వారసత్వమే కావచ్చు. అందరికీ ఒకలాగా అందదు. కొందరికి పువ్వులతో వస్తుంది. ఇంకొందరికి ముళ్ళతో వస్తుంది. సోనియా గాంధీకి రెండో పధ్ధతిలో వచ్చింది.

వ్యూహం లేని గ్లామర్‌.. వాసన రాని పువ్వు!

ఒకప్పుడు గ్లామరే రాజకీయం. నేడు వ్యూహమే సర్వస్వమయిపోయింది. కేవలం వ్యూహమే వుండి, జనాకర్షణ లేకపోయినా దిగులు లేదు. తర్వాత అదే జనాకర్షణగా మారుతుంది. ఉత్త జనాకర్షణ వుండి వ్యూహం లేక పోతే.. ఆ మెరుపు ఎన్నాళ్ళో నిలవదు. జాతీయ రాజకీయాల్లో రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోడీల విషయంలో అదే జరిగింది. రాహుల్‌ గాంధీకి జనాకర్షణ అన్నది…

‘శంకల’ అయ్యర్‌!

పేరు :మణి శంకర్‌ అయ్యర్‌ దరఖాస్తు చేయు ఉద్యోగం: కేంద్ర వివాదాస్పద వ్యాఖ్యల శాఖా మాత్యులు. (బీజేపీ ఎలాగూ ఇవ్వదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక, ఇలాంటి శాఖను ఏర్పాటు చెయ్యటానికి వెనకాడదు కానీ, ఆ పదవి నాకివ్వటానికి ఇష్టపడదు. ఇంకేదన్నా సర్కారు వస్తే ఇస్తుందేమో చూడాలి.) వయసు : ఏం? ఎందుకా సందేహం? వయసుకు తగ్గట్లు…

తెలుగు లో తిట్టు లేదా? తెలుగు మీద పట్టు లేదా?

‘మీరెవరు?’ ప్రశ్నే. సాదాసీదా ప్రశ్నే. ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు,ఎవరో ఒకరికి ఈ ప్రశ్న ఎదురవుతుంది. స్థలమూ, సందర్భమూ సమాధానాన్ని నిర్ణయిస్తాయి. స్థలం: మనదేశంలోని ఒకానొక గ్రామం. సందర్భం: ఆ ఊరికి కొత్త కావటం. అడిగిన వ్యక్తి: ఆ పల్లెలో ఓ పెద్దాయన. ఆ కొత్త వ్యక్తినుంచి వచ్చే సమాధానాలు ఏయే రకాలుగా వుండవచ్చు.…

వణకే ‘గాడ్సే’లూ… తొణకని ‘లంకేష్‌’ లూ…!

తలకాయ ఉపయోగించని వాడికి తలలంటే భయం. ఆలోచించే తలలంటే మరింత భయం. అసలు తలలే లేని మనుషులుంటే బాగుండుననుకుంటాడు. భయస్తుడి తొట్టతొలి ఆయుధమే హింస. ఆది కాస్తా వాడేస్తే నిద్రపడుతుందనుకుంటాడు. ఆ తర్వాత మరెప్పటికీ నిద్రపోలేడు. దేశంలో భయస్తులు జాగారం చేస్తున్నారు. వారి భయాలు పలురకాలుగా వున్నాయి: ఆడపిల్లలు అర్థరాత్రి రోడ్ల మీద తిరిగేస్తారేమోనని భయం;…

ఇక్కడి బాల్యానికి ‘డబ్బు’ చేసింది..!!

చెడిపోవాలన్న కోరిక పుట్టాలే కానీ, ఎలాగయినా చెడిపోవచ్చు. డబ్బుండీ చెడిపోవచ్చు; డబ్బులేకా చెడిపోవచ్చు. వెనకటికి కవి కాళోజీ అన్నాడు -ఉన్నవాడిదీ లేని వాడిదీ ఒకటే బాధ:’తిన’లేక- అని. ఇప్పుడు డబ్బున్న పిల్లలకీ, డబ్బులేని పిల్లలకీ ఒక్కటే జబ్బొస్తోంది. మైనారిటీ తీరకుండానే, బాల్యం వదలకుండానే, పెద్ద పెద్ద పనులు చేసేస్తున్నారు. క్రూరమైన, ఘోరమైన నేరాలు చేసేస్తున్నారు. ఖరీదయిన…

మీటింగ్స్‌ తోనే రాహుల్‌కు రేటింగ్సా..?

రాహుల్‌ గాంధీ రేంజ్‌ హఠాత్తుగా మారిపోయిందా? ఆయన రేటింగ్స్‌ ఠపీ మని పెరిగిపోయాయా? యువరాజుకి పార్టీలో రాజయోగం పట్టేసినట్లేనా? అధ్యక్షుడికి ముందు వున్న ‘ఉప’ విశేషణం తొలిగిపోయినట్లేనా? చూడబోతే, ఇలాంటి వింత ఏదో దేశ రాజకీయాల్లో జరిగేటట్లుగానే వుంది. ఆటలో ఎప్పుడోకానీ గెలవని వాడిని, గెలిపించాలంటే రెండే రెండు మార్గాలు. ఒకటి: ఆట నేర్పించటం రెండు:…

‘మూడు’తలాకులూ..’ఆరు’తడబాట్లూ..!

మూడు ముడులు వేస్తే పెళ్ళి. ఇది ఒక ఆచారం. మూడు మాటలంటే విడాకులు. ఇది ఇంకో ఆచారం. ఈ రెండు ఆచారాలు, రెండు వేర్వేరు మత విశ్వాసాలకు చెందినవి. ‘మూడు’ అనే సంఖ్య తప్ప రెంటికీ వేరే ఏ పోలికా లేదు. పైపెచ్చు వైవాహిక జీవితానికి  ఇదే ‘మూడు’ఒక చోట ఆహ్వానం; మరొక చోట వీడ్కోలు.కాకుంటే…