లీడరా? అంటే ఎవరు?
సమాధానం తెలిసినట్టుగానే వుంటుంది కానీ, తెలియనట్టుగా కూడా వుంటుంది. కొన్ని అంతే. ప్రేమికుడా? అంటే? అప్పుడు ఇలాగే చెబుతాం.
కానీ కొందరు మహానుభావులు వుంటారు. మరీ నిర్వచనాలు ఇవ్వరు కానీ, చిన్న చిన్న క్లూలు ఇచ్చి వెళ్ళిపోతారు. గురజాడ అప్పారావు ఇదే పనిచేశారు.
లీడర్ గురించి చెప్పలేదు కానీ, పాలిటిష్యన్ గురించి చెప్పారు. నిజానికి చెప్పారూ అనటం కన్నా, చెప్పించారూ అనటం సబబు గా వుంటుంది.
‘ఒపీనియన్స్ చేంజ్ చేస్తేనే కానీ పాలిటిష్యన్ కాలేడు’ అని ఓ తుంటరి పాత్ర చేత అనిపిస్తాడు