
నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాల హడావిడి నడుస్తోంది. ఈ కవిత ఎప్పుడో 
20యేళ్ళ క్రితం రాసింది. నా ‘పంచమ వేదం’ కవితా సంపుటిలో వుంది. ఈ కోడిపందాలకు నేపథ్యం 
పండుగ కాదు, ఒక విషాదం. ముంబయిలో హిందూ,ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగిన 
నేపథ్యంలో, ఇరు వర్గాలలోని అమాయకపు ప్రజలు బలయ్యారు. నిజానికి  ప్రజల మధ్య మత 
సామరస్యం ఎప్పుడూ వుంటుంది. స్వార్థ రాజకీయ శక్తులే వారిని రెచ్చగొడతారు. వాళ్ళకాళ్ళకు 
కత్తులు కట్టి బరిలోకి దించుతారు. అనుకోకుండా ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం రాష్టంలో 
వుంది. చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి మందిర వివాదంతో పాటు, అక్బరుద్దీన్, తొగాడియాల 
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్బంది కరవాతావరణం నెలకొని వుంది. దాని స్థానంలో స్నేహ 
పూర్వక వాతావరణం తిరిగి నెలకొలాని కాంక్షిస్తూ, నా మిత్రుల కోసం మరో మారు ఈ కవిత. 
చదవండి.
Read more →